epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
అర్హులైన వారిని ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి
అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పనే లక్ష్యం
బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకం
డీసీసీ అధ్య‌క్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన సదస్సు

కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు) పూర్తి అవగాహనతో, అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు అధ్యక్షతన బూత్ లెవల్ ఏజెంట్ల ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లు ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అర్హులందరికీ ఓటు హక్కు.. నకిలీ ఓట్లపై నిఘా
క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు చొరవ చూపాలని, అదే సమయంలో నకిలీ మరియు అనర్హమైన ఓట్ల తొలగింపుపై నిరంతరం నిఘా ఉంచాలని వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే రాబోయే ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ లెవల్ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా, చురుగ్గా పనిచేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకతను కాపాడేందుకు గాను ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన అంశాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేక అవగాహన సదస్సులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.