epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవినీతి ‘ఖాకీ’లపై సీపీ కొరడా

అవినీతి ‘ఖాకీ’లపై సీపీ కొరడా
క‌మిష‌రేట్‌లో కొన‌సాగుతున్న ప్రక్షాళన
డేగ క‌ళ్ల‌తో..వివిధ మార్గాల్లో స‌మాచార‌ణ సేక‌ర‌ణ‌
నివేదికల ఆధారంగా కఠిన నిర్ణయాల అమ‌లు
ఏఆర్‌కు ఇటీవల ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావు
తాజాగా నర్మెట్ట సీఐ అబ్బయ్య, ఎస్‌ఐ హమీద్‌లపై వేటు
అవినీతిపరులకు సహించేది లేదని సీపీ హెచ్చరిక
పారదర్శక పాలనపై పోలీస్ బాస్ ప్రత్యేక నిఘా

కాక‌తీయ‌,వ‌రంగ‌ల్‌బ్యూరో : పోలీస్ శాఖలో అవినీతికి, అక్రమాలకు ఏమాత్రం తావులేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మరోసారి తన రాజీలేని వైఖరిని చాటిచెప్పారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కొరడా ఝుళిపించారు. కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్యతో పాటు, గతంలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న షేక్ హమీద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నివేదికల ఆధారంగా కఠిన నిర్ణయం
ఈ ఇద్దరు అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీపీ అత్యంత సీరియస్‌గా పరిగణించారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించగా, ఆరోపణలు నిజమని ప్రాథమిక ఆధారాలు లభించాయి. శాఖా పరమైన నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో.. తక్షణమే వారిని సస్పెండ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించే ఎంతటి అధికారిపైనా చర్యలు ఉంటాయని ఈ నిర్ణయం ద్వారా ఆయన స్పష్టం చేశారు.

కొనసాగుతున్న ప్రక్షాళన..
వరంగల్ కమిషనరేట్‌లో గత కొంతకాలంగా ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావును ఆరోపణల నేపథ్యంలో ఏఆర్‌కు అటాచ్ చేయడంతో పాటు, పలువురు ఎస్‌ఐలను బదిలీ చేయడం ద్వారా పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించడం, విజిలెన్స్ నివేదికల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవడం వంటి విధానాలను సీపీ సన్‌ప్రీత్ సింగ్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలను, ప్రజల నుంచి నేరుగా వచ్చే ఫిర్యాదులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.

సిబ్బందికి స్పష్టమైన సందేశం
తాజా సస్పెన్షన్ల నేపథ్యంలో, కమిషనరేట్‌లోని సిబ్బందికి సీపీ సన్‌ప్రీత్ సింగ్ గట్టి సంకేతాలు పంపారు. పోలీస్ శాఖ అంటేనే ప్రజలకు రక్షణ, భరోసా అని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హోదాతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. నిజాయితీగా, జవాబుదారీతనంతో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూనే, అక్రమాలకు పాల్పడే వారిని శాఖ నుంచి తొలగించే దిశగా సీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన పనితీరును పెంచుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.