epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తప్పుడు పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్

తప్పుడు పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్
మున్సిపల్ రికార్డుల్లో లేని నకిలీ ధృవీకరణ పత్రాలు
కుటుంబ ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు య‌త్నం
అక్ర‌మంగా బ్యాంకు రుణం కూడా పొందారు
బాధ్యులపై చర్యలు తీసుకోవాల‌ని గుండెబోయిన రవి డిమాండ్

కాకతీయ, ములుగు ప్రతినిధి : తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిని, తన ప్రమేయం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, ఆ ఆస్తిపై బ్యాంక్ రుణం కూడా పొందారని బాధితుడు గుండెబోయిన రవి ఆరోపించారు. ములుగులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రవి తెలిపిన వివరాల ప్రకారం.. 1997లో ఒక ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుని, అందులో రూ. లక్ష చెల్లించారు. అప్పట్నుంచే ఆ ఇంటిని తమ కుటుంబం స్వాధీనంలో ఉంచుకుని, పన్నులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. అయితే 2012 నుంచి ఈ ఆస్తిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో 2019లో రవికి తెలియకుండానే తన తమ్ముడు గుండెబోయిన శ్రీనివాస్, తన భార్య శ్రీకల పేరుతో నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

మున్సిపల్ రికార్డుల్లో ఆధారాల్లేవ్

ఆర్.టి.ఐ ద్వారా సేకరించిన సమాచారంలో, సదరు ధృవీకరణ పత్రాలకు ఎటువంటి అధికారిక ఆధారాలు లేవని, అవి నకిలీవని మున్సిపల్ కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా స్పష్టం చేశారని రవి వెల్లడించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డం పెట్టుకుని ఫెడరల్ బ్యాంకులో సుమారు రూ. 15 లక్షల గృహ రుణం పొందారని ఆయన ఆరోపించారు. బ్యాంకు రికార్డుల్లో 2007 నుంచే శ్రీకల పేరుతో యాజమాన్యం ఉన్నట్లు చూపడంపై రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2007లో శ్రీకలకు వివాహం కాలేదని, ఆమె మైనర్ అని, తొమ్మిదో తరగతి చదువుతున్నారని ఆయన తెలిపారు. అటువంటి స్థితిలో ఆమె పేరుతో ఆస్తి పత్రాలు ఎలా నమోదయ్యాయని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల్లో సాక్షులుగా వ్యవహరించిన పైడిమల్ల జ్యోతి, భరత్‌లతో పాటు, సహకరించిన అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన ఆస్తి వాటాను ఇప్పించాలని, నకిలీ పత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.