epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిని బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 22 నెలల పాటు ఆలస్యం జరిగిందని, చివరికి బీజేపీ సూచించిన మార్గాన్ని అనుసరించి బిల్లు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై నిజాయితీగా ఉంటే, మొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కి పంపించి ఉండాల్సి ఉందని రాంచందర్ రావు అన్నారు. కానీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో బీసీలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ అసలైన ద్రోహ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవడం వల్ల 73వ, 74వ సవరణల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.3,000 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా పోయాయని ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ వైఫల్యం కారణంగా రాష్ట్రానికి జరిగిన పెద్ద నష్టం అని అన్నారు.

ఇక బీసీల పట్ల బీజేపీ కట్టుబాటు ఉన్నదని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీలను చేర్చడం, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇవ్వడం వంటి నిర్ణయాలు దీనికి నిదర్శనమని రాంచందర్ రావు గుర్తుచేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమ కేబినెట్‌లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. బీసీల హక్కులను కాపాడాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

అదే సమయంలో, ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని రాంచందర్ రావు చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.