కాకతీయ ఎఫెక్ట్
టీజీబీలో సిగ్నల్ సమస్య పరిష్కారం
కాకతీయ కథనానికి స్పందించిన బ్యాంకు యంత్రాంగం
పున:ప్రారంభమైన బ్యాంకింగ్ సేవలు
కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టిజిబి) రాయపర్తి శాఖలో సిగ్నల్ సమస్యకు పరిష్కారం లభించింది.సాంకేతిక సమస్యలు,సిగ్నల్ లోపంతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులపై కాకతీయ దినపత్రికలో ఈనెల 5వ తేదీ ఆదివారం రోజు ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.వర్షం కారణంగా బ్యాంకు పైన ఉన్న నెట్వర్క్ యాంటిన కదలడంతో సిగ్నల్ పూర్తిగా నిలిచిపోయి, రైతులు,వృద్ధులు,మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్న తీరును కాకతీయ పత్రిక వెలుగులోకి తెచ్చింది.ఈ వార్త కథనంపై స్పందించిన బ్యాంక్ మేనేజర్ సాంకేతిక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.యుద్ధప్రాతిపదికన బ్యాంకు నెట్వర్క్ యాంటిన్నాను సరి చేసి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించారు.సోమవారం ఉదయం నుండి సర్వర్ సాధారణ స్థితికి రావడంతో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుతున్నాయి. సర్వర్ సమస్యలు తొలగిపోవడంతో స్థానిక ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిష్కారానికి కృషి చేసిన కాకతీయ దినపత్రికకు,బ్యాంకు మేనేజర్ భూక్య హుస్సేన్, ఉన్నతాధికారులకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

