70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల ఎమ్మార్వో
- బాధితుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్
- డబ్బు స్వీకరిస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు
- చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో కలకలం
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ
కాకతీయ,చేర్యాల: చేర్యాల మండల ఎమ్మార్వో దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భూ సంబంధిత పని చేసిపెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి సమాచారంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో దిలీప్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అధికారులు నగదు స్వాధీనం చేసుకుని, సంబంధిత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


