శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు కృషి చేయాలి
బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నర్సంపేట బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సమైక్యత, అఖండత కోసం ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వడ్డేపల్లి నరసింహారాములు, జూలూరు రోజారాణి, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

