epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విలువల రాజకీయం.. ఎవరిది?

విలువల రాజకీయం.. ఎవరిది?
ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి గెల‌వాలి
ప‌ర‌ప‌తి ఉంటే మంత్రి ప‌ద‌వి తెచ్చుకోవాలి
ద్వంద్వ వైఖరితో కడియం రాజకీయ డొల్లతనం
ఆయ‌న మాట్లాడేది ఒక‌టి..చేసేది మ‌రోక‌టి
కడియంకు కొండా సురేఖ కౌంటర్..

కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : రాజకీయాల్లో విలువలు.. ఆ మాట వింటేనే కడియం శ్రీహరి నవ్వుతారేమో కానీ, ఇప్పుడు అదే మాటతో మంత్రి కొండా సురేఖ ఆయనకు ‘చుక్కలు’ చూపిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి అంటుకుని.. పార్టీ మారిన కడియం తీరుపై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ‘నిప్పు’ రాజేశాయి. ఎదురుదాడి చేయడం కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని ఆమె విసిరిన సవాల్, కడియం శిబిరంలో కలకలం రేపుతోంది. బిడ్డకు కాంగ్రెస్ కండువా కప్పడం, ఎంపీగా గెలిపించుకోవడం.. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాను మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడం మరో ఎత్తు! ఇదే కదా కడియం శ్రీహరి ‘పాలిటిక్స్’ అని కొండా సురేఖ ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోని బిడ్డను ఎంపీని చేసుకున్న కడియం, తానూ కాంగ్రెస్ నాయకుడినని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని ఆమె నిలదీశారు. రాజకీయాల్లో ఒక స్పష్టత ఉండాలి కదా అని సురేఖ అడుగుతున్న ప్రశ్నలకు కడియం వద్ద సమాధానం ఉందా? లేదా ఆయన వౌనం వహిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

విలువలు.. ఎండమావులేనా?
రాజకీయాల్లో విలువలు ఉండాలని నీతులు చెప్పే కడియం శ్రీహరి, అసలు తన రాజకీయం ఏంటో ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ హితవు పలికారు. తప్పులను సమర్థించుకుంటూ ఎదురుదాడి చేయడం సరికాదని, నైతికత లేని రాజకీయం ప్రజల ముందు ఎలా నిలబడుతుందని ఆమె నిలదీశారు. తన అధికారాన్ని వాడుకుంటూ మంత్రిగా తన పరిధిని దాటి వ్యవహరించడం, మళ్లీ ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సురేఖ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అసంతృప్తి సెగలు!
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ మారినా పదవిని వదులుకోని కడియం తీరుపై కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతోంది. కొండా సురేఖ నేరుగా రంగంలోకి దిగి ఆయనపై చేసిన ఈ విమర్శలు.. జిల్లా రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తున్నాయి. కడియం అనుసరిస్తున్న ఈ ‘ద్వంద్వ’ రాజకీయంపై సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ‘విలువలు’ అనే పదాన్ని ఇప్పుడు ఎవరికి వారు తమకు అనుకూలంగా వాడుకుంటూ, ప్రజలను అయోమయంలో పడేస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.