- బీఎల్‌ఓలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజల హెచ్చరిక
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో ఎస్‌ఐఆర్ ఫారాలు నింపుతున్న సందర్భంగా పలు వార్డులల్లో కొందరు బీఎల్‌ఓలు ప్రజల నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ సేవలకు డబ్బులు తీసుకుంటున్న ఫారలు నింపడం సరైంది కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫారాలు నింపేందుకు ఎలాంటి రుసుము లేదని తెలిసినా కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, దీంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే విచారణ జరిపి, అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, ఫారాల ప్రక్రియ పూర్తిగా ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతున్నారు.

