ఏఎస్సైగా ఉద్యోగన్నతులకు సీపీ అభినందనలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సై (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) గా ఉద్యోగన్నతి పొందిన 28 మంది పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. పదోన్నతి పొందిన వారు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లా కు బదిలీపై వెళ్ళనున్నారు.

