epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేషన్ బస్తాల్లో నూకల మయం

రేషన్ బస్తాల్లో నూకల మయం
పేదోడి బియ్యం పై పట్టింపు లేదా?
వరంగల్, ఖిలా వరంగల్‌లో నాణ్యతలేని బియ్యం పంపిణీ
50.650 కిలోలకు బదులు 45 కిలోలు
లెక్కలు సరిపోక డీలర్లు, ప్రజలు ఇద్దరూ నష్టంలో

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : “ఉచితం కదా అని ఏది పడితే అది ఇస్తారా?” అంటూ వరంగల్, ఖిలా వరంగల్ మండలాల ప్రజలు ప్రభుత్వంపై, సివిల్ సప్లై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత కనిపించడం లేదు. చల్లగోదాముల నుంచి వస్తున్న బస్తాలు తెరిస్తే బియ్యానికి బదులు సగానికి సగం నూకలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం పంపిణీపై పర్యవేక్షణ ఉందని, ప్రతి బస్తాను పరిశీలించే సప్లై చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

చల్లగోదాము నుంచి నేరుగా నూకలా?
గత కొంతకాలంగా రేషన్ డీలర్లకు సరఫరా అవుతున్న బస్తాల్లో నాణ్యత తీవ్రంగా పడిపోయిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బస్తా విప్పగానే ధూళిలా నూకలు వస్తున్నాయి. వండితే ముద్దగా అవుతోందని, పిల్లలు సైతం తినలేకపోతున్నారని ఓ లబ్ధిదారుడు వాపోయాడు. సివిల్ సప్లై డిటి, అధికారులు ప్రతి లారీని చెక్ చేస్తామంటారు. మరి ఇన్ని నూకల బస్తాలు ఎలా వస్తున్నాయి? గోదాములోనే మార్పిడి జరుగుతుందా? అని ప్రజలు నిలదీస్తున్నారు. పేదలకు ఇచ్చేది కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేదనే భావనతో అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

బరువులోనూ భారీ కోత..డీలర్లకు చుక్కలు
రేషన్ సరఫరాలో నాణ్యత ఒక్కటే కాదు, బరువులోనూ గోల్‌మాల్ జరుగుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రేషన్ షాపులకు వచ్చే ప్రతి బస్తా 50 కిలోల 650 గ్రాములు ఉండాలి. కానీ వస్తున్న బస్తాల్లో కొన్ని 45 నుంచి 46 కిలోల మధ్యే ఉంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం మాకు 50.650 కిలోల లెక్కన బియ్యం ఇస్తుంది. కానీ బస్తాలో 4-5 కిలోలు తక్కువ వస్తే ఆ నష్టం ఎవరు భరిస్తారు? లబ్ధిదారులకు పూర్తి కోటా ఇవ్వలేక మాటలు పడుతున్నామని ఓ డీలర్ ఆవేదన చెందారు. దీంతో లెక్కలు సరిపోక, పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు.

పేదోడి కడుపు కొట్టొద్దు – వెంటనే చర్యలు తీసుకోండి
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు అందిస్తున్న పథకం ఇది. కానీ మధ్యలోనే నాణ్యత, బరువు విషయంలో జరుగుతున్న అక్రమాల వల్ల అసలు లబ్ధిదారులకే నష్టం జరుగుతోంది.
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకానికి ఇదేనా నిదర్శనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పుక్కిటికి ఇచ్చేది కాబట్టి పట్టించుకోవడం లేదు. అదే మార్కెట్‌లో అమ్మే బియ్యం అయితే ఇలా ఇస్తారా? అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, చల్లగోదాముల నుంచి జరిగే ప్రతి సప్లైని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యత, బరువులో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.