రాజధానిలో త్రివర్ణ శోభ
స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబైన కీలక భవనాలు
కాకతీయ, హైదరాబాద్ : 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రాజధానిలోని సచివాలయం, శాసనసభ, చారిత్రక గోల్కొండ కోట త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో కీలక భవనాలను జాతీయ జెండా రంగులతో అలంకరించారు. రాత్రివేళ త్రివర్ణ కాంతులతో మెరిసిన భవనాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి.


