epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చదువుతోనే తలరాత మారుతుంది

చదువుతోనే తలరాత మారుతుంది
ప్రజాపాలనలో ఫూలే దంపతుల విధానాలు
అందరూ కలిసే చదివితే కులవ్యవస్థ నిర్మూలన
యంగ్‌ ఇండియా పాఠశాలలతో విప్లవాత్మక మార్పులు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నెల రోజుల్లోనే పూర్తి చేస్తాం
క్రీడల్లో పతకాలు సాధిస్తే ఉద్యోగం, నజరానా
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్క‌ర‌ణ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : చదువుతో తలరాత మారుతుందని, ఆత్మగౌరవంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట చదువుతూ, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే చూపిన బాటలో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహనీయుల విగ్రహాలను చూసినప్పుడు వారి త్యాగాలు, స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని సూచించారు. చదువే ఆయుధంగా మారుతుందని జ్యోతిబా ఫులే గుర్తించారని, అదే స్ఫూర్తితో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

యంగ్‌ ఇండియా పాఠశాలలతో మార్పు

విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని సీఎం తెలిపారు. యంగ్‌ ఇండియా పాఠశాలల ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. కృత్రిమ మేధ కారణంగా నిపుణుల ఉద్యోగాలకు సైతం ముప్పు ఏర్పడుతున్న పరిస్థితుల్లో యువతకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభిస్తోందని, జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అలాంటి నైపుణ్యాలు అందించి, అవసరమైతే ఆయా దేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నెలలోనే

ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ముందుగానే క్రెడిట్‌ చేస్తున్నామని చెప్పారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని, కళాశాలలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జనగణనలో భాగంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోనే లెక్కలు తేల్చి ఫిబ్రవరి నాలుగో తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కొందరు కులగణన, జనగణన ప్రక్రియలో భాగస్వామ్యం కాకుండా కోర్టును ఆశ్రయించారని, అసెంబ్లీలో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ చట్టపరంగా కమిషన్‌ ఏర్పాటు చేసి లెక్కలు తేల్చామని వివరించారు. జనాభా లెక్కలు తేల్చాలంటే కులగణన చేయక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పతకాలు సాధిస్తే ఉద్యోగాలు

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నజరానాలు అందిస్తామని వెల్లడించారు. క్రీడల్లో ప్రతిభ చూపే యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువులు, క్రీడలు, పరిపాలన వంటి రంగాల్లో రాణించాలని సూచించారు. పారదర్శక పాలన అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.