epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వనదేవతలకు క్షమాపణ చెప్పాకే ములుగులో అడుగుపెట్టాలి

రేవంత్‌..! వనదేవతలకు ముందు క్షమాపణ చెప్పు..
సమ్మక్క–సారక్క తల్లులపై ప్రమాణాలు చేసి మోసం చేశారు
హామీలపై మాట తప్పినందుకు ప్రజలను న‌య‌వంచ‌న‌
ప్రకృతి విపత్తులకు సీఎం వైఖరే కారణం
కేసీఆర్‌ వేసిన పునాదులపై కాంగ్రెస్‌ రంగులు
ములుగు ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు
బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు

కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రకృతి విపత్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై పదేపదే ప్రమాణాలు చేసి, అనంతరం మాట తప్పడమే కారణమని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ములుగు జిల్లాలో అడుగుపెట్టే ముందు సీఎం రేవంత్‌రెడ్డి సమ్మక్క–సారక్క వనదేవతల వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పినందుకు ప్రజల ముందు క్షమాపణ చెప్పిన తర్వాతే కలెక్టరేట్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్‌బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దేవతలపై ఓట్లు వేసి మాట తప్పడం సీఎంకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని లక్ష్మణ్‌బాబు విమర్శించారు. సమ్మక్క–సారక్క తల్లులపై పదేపదే ప్రమాణాలు చేసి మాట తప్పడం వల్లే ములుగు ప్రాంతంలో టోర్నాడోలు, సుడిగాలులు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరి కూడా ప్రజలను భయపెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

వనదేవతలను అవమానిస్తే క్షమించరు

వనదేవతలను అవమానించి, ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడితే సమ్మక్క–సారక్క తల్లులు కూడా సీఎం రేవంత్‌రెడ్డిని క్షమించరని లక్ష్మణ్‌బాబు హెచ్చరించారు. ములుగు ప్రజల ఆరాధ్య దైవాలపై చేసిన ప్రమాణాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ములుగు కలెక్టరేట్‌ నిర్మాణానికి మాజీ సీఎం కేసీఆర్‌ ఫౌండేషన్‌ వేసి, రూపురేఖలు తీసుకొచ్చి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారని లక్ష్మణ్‌బాబు తెలిపారు. తాము కట్టిన కలెక్టరేట్‌కు రంగులు వేసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించినట్లుగా ప్రచారం చేసుకోవడం రాజకీయ ప్రచారంలో భాగమేనని విమర్శించారు. ఎవరు పునాదులు వేశారు, ఎవరు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు ఎవరు ప్రారంభిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకు రంగులు వేసుకుని తమ ఘనతగా చెప్పుకోవడం, మరోవైపు దేవతలపై ప్రమాణాలు చేసి మాట తప్పడం కాంగ్రెస్‌ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని లక్ష్మణ్‌బాబు మండిపడ్డారు. ప్రజల విశ్వాసాలను గౌరవించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.