epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను కొనసాగించాలి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను కొనసాగించాలి
ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలి
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి
బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన.. ఆర్డీవోకు వినతిపత్రం

కాకతీయ, నర్సంపేట టౌన్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించి పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర పేద కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.

పెండింగ్‌ లబ్ధిదారులకు సాయం అందించాలి

ప్రస్తుతం ఈ పథకాల అమలుపై నెలకొన్న అనిశ్చితిని ప్రభుత్వం వెంటనే తొలగించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కోర్టు పరిణామాలను సాకుగా చూపకుండా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించే అంశాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను పార్టీలకు అతీతంగా కొనసాగించాలని కోరారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సంపేట ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిడి రవీందర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, తక్కలపల్లి రవీందర్‌రావు, నామాల సత్యనారాయణ, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు, వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, మండల శ్రీనివాస్, రాయుడు దుశాంత్‌రెడ్డి, బూస రాజు, దొమ్మటి సంతోష్, నవీన్‌నాయక్, పెండెం వెంకటేశ్వర్లు, కడారి కుమార్, కందికొండ శ్రీనివాస్, బీరం నాగిరెడ్డి, బండి ప్రవీణ్, చింతల టార్జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.