epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బందిపోటు ముఠాపై పీడీ యాక్ట్‌

బందిపోటు ముఠాపై పీడీ యాక్ట్‌
పీఎంజే జ్యువెలర్స్‌ దోపిడీ కేసులో కీలక చర్య
సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.82 లక్షల బంగారం దోపిడీ
ప్రధాన నిందితులైన ఐదుగురిపై నిర్బంధ ఉత్తర్వులు
ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు
చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు
పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం

కాకతీయ, కరీంనగర్‌ : నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరస్థుల్లో భయాన్ని కలిగించేందుకు పీ.యం.జే. జ్యువెలర్స్‌ బందిపోటు కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిపై పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2026 మే 3న కరీంనగర్‌ పట్టణంలోని పీ.యం.జే. జ్యువెలర్స్‌ దుకాణంలోకి చొరబడిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఐదుగురిపై ఆదివారం పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీ యాక్ట్‌ కింద నిర్బంధించిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్‌ కర్మాకర్‌ అలియాస్‌ జాగీరా సింగ్‌, బీహార్‌లోని నలందకు చెందిన రావిష్‌ కుమార్‌ అలియాస్‌ ప్రద్యుమాన్‌, సూర్యమణి కుమార్‌ అలియాస్‌ సనోజ్‌, పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌కు చెందిన యాదవ్‌ అలియాస్‌ జైనుల్‌ అబ్దిన్‌, మహమ్మద్‌ ఆదిల్‌ ఖాన్‌ ఉన్నారు. నేర కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా జైలు నుంచి చర్లపల్లికి

పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను కరీంనగర్‌ జిల్లా జైలులో ఉన్న నిందితులకు అందజేశారు. అనంతరం వారిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసులో ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్‌ అమలు చేయడంతో పోలీసు శాఖ కఠిన వైఖరిని స్పష్టం చేసింది. పీడీ యాక్ట్‌ అమలులో కీలక పాత్ర పోషించిన కరీంనగర్‌ పట్టణ ఏసీపీ ఎన్‌. వెంకటస్వామి, రెండో పట్టణ సీఐ కె. సృజన్‌రెడ్డిని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.