మోడల్ స్కూల్‌లో ఘనంగా తీజ్ ఉత్సవం
సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి
పీఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి. ఉపేందర్‌రావు
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో మంగళవారం తీజ్ ఉత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్ పండుగ విశిష్టతను ప్రతిబింబించే పాటలు, నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. ఉపేందర్‌రావు మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరగడంతో పాటు పరస్పర గౌరవం, ఐక్యతా భావం పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

