చిరస్మరణీయుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి
17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
పేదల గుండెచప్పుడుగా నిలిచిన మహానేత
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్
కాకతీయ, పెద్దవంగర : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి చిరస్మరణీయుడని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్ అన్నారు. ఆయన 17వ వర్ధంతి సందర్భంగా పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళి గౌడ్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించిన ఘనత వైఎస్ఆర్కు దక్కుతుందన్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్రెడ్డి, పొడిశెట్టి సైదులు, శ్రీనివాస్ ముదిరాజ్, వేణు, నరేష్, అనపురం శ్రీనివాస్, హరికృష్ణ, రహీమ్, సంపత్, వెంకన్న, మోహన్రావు, బోస్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

