epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలి
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెలగాటమాడొద్దు
పేద విద్యార్థుల చదువుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కీలకం
మాజీ ప్ర‌భుత్వ‌ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌ భాస్కర్‌

కాక‌తీయ‌, హనుమకొండ : విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి విద్యకు ఆటంకం కలిగించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను పెండింగ్‌లో ఉంచడం సరికాదని మాజీ చీఫ్‌విప్‌, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెలగాటమాడొద్దని హెచ్చరించారు. హనుమకొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సందర్భంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ స్మృతివనం నుంచి హనుమకొండ కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని, జీవో 97ను రద్దు చేయాలని నినదించారు.

చదువుకు ఆటంకం కలిగించొద్దు

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంతో కీలకమని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. నిధులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువులు, కళాశాలల్లో ప్రవేశాలు, పరీక్షలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. విద్యార్థుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, పెండింగ్‌ నిధులను తక్షణమే విడుదల చేసి వారి విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, విద్యావేత్తలు, సంబంధిత వర్గాలతో చర్చించి వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్య సాంకేతిక విద్యలో కీలకమైన భాగమని, వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఈ విద్యపై ఆధారపడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే బీఆర్‌ఎస్‌ విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఓరుగల్లు గడ్డపై పోరుబాట చేపట్టాల్సి వచ్చిందని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు జీవో 97ను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని, వారి సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమానికి వస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారు కార్యక్రమానికి సంఘీభావం తెలిపి ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, యువత హక్కుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.