epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హామీలను గాలికొదిలిన కాంగ్రెస్‌

హామీలను గాలికొదిలిన కాంగ్రెస్‌
1000 రోజుల పాలన ప్రజలకు నిరాశే
420 హామీల అమలులో ప్రభుత్వం విఫలం
రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

కాకతీయ, చెన్నారావుపేట : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్నతో కలిసి ముత్తిరెడ్డి నిరసనలో పాల్గొని అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని ముత్తిరెడ్డి ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఉచిత స్కూటీలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా, పంటల కొనుగోలు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్‌ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రశ్నించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, కేసీఆర్‌ కిట్‌ హామీల పరిస్థితి ఏంటని నిలదీశారు.

నర్సంపేటపై నిర్లక్ష్యం

నర్సంపేట నియోజకవర్గంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పరిష్కారం కోసమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తుచేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావచ్చుగానీ ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోలేరని ముత్తిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల తరఫున బీఆర్‌ఎస్‌ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్లు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, యువజన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.