epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే
మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి
డప్పును, మాదిగలను అవమానించారు
బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ విమ‌ర్శ‌లు
కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సంధ్యారావు అనే వ్య‌క్తిని సృష్టించింది ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డేనని, డప్పును.. మాదిగలను అవమానించినందుకు మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మాదిగలు ఎవరి చావును కోరుకోరని, డప్పు..! మనిషి బతకాలని చెప్పే తమ సంస్కృతిలో భాగమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంధ్యారావు ఎవరో, ఆమెను ఎవరు సృష్టించారో రాష్ట్ర ప్రజలు అన్వేషిస్తున్నారని అన్నారు. సంధ్యారావు పేరుతో మహిళ ఫొటో, పురుషుడి వాయిస్‌తో ఉన్న పోస్టును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. లక్షలాది సోషల్‌ మీడియా పోస్టులు ఉండగా.. ముఖ్యమంత్రికి సంధ్యారావు పోస్టే ఎలా దొరికిందని ప్రశ్నించారు. గత 3 రోజులుగా తెలంగాణ అబద్ధాలతో మునిగిపోయిందని ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు, 22ఏ, పాలిటెక్నిక్‌, రెవెన్యూ తదితర అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని దాడులు చేశారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల వద్ద పురుష పోలీసులను, పురుష ఎమ్మెల్యేల వద్ద మహిళా పోలీసులను పెట్టి వివాదాస్పద పరిస్థితులు సృష్టించారన్నారు. ఓ ఎమ్మెల్సీ ఆవేశంలో మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని దళితులను అవమానించారంటూ కేసులు పెట్టారని చెప్పారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కాంగ్రెస్‌ నాయకులే దళిత దళిత అంటూ అవమానించారని, ఆయన తల్లిని ఎవరూ ఏమీ అనలేదని అన్నారు. సీతక్క పదేపదే ఆ అంశాన్ని ప్రస్తావించి స్పీకర్‌ను బాధించారని విమర్శించారు. తాతా మధు నేరుగా స్పీకర్‌ను తిట్టలేదని పోలీస్‌ రిపోర్టే చెప్పిందని, కోర్టు కూడా కేసును కొట్టివేసిందన్నారు. అనంతరం రేవంత్‌ రెడ్డి సూచనతోనే షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కేసీఆర్‌ చావు కోరుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
డప్పు.. మాదిగల ఆత్మగౌరవం
మాదిగలు ఎప్పుడూ మనిషి చావును కోరుకోరని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఆదిమ మానవుడి కాలం నుంచి ప్రమాదాల నుంచి రక్షణకు, సమాచారాన్ని చేరవేయడానికి డప్పు ఉపయోగపడిందన్నారు. పెళ్లిళ్లు, పోచమ్మ పండుగలు, చాటింపులు, చావులు, పోరాటాల్లో డప్పు భాగమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ లక్షలాది డప్పులు పెత్తందార్లకు వ్యతిరేకంగా మోగాయని, డప్పు తిరుగుబాటు బావుటా అని పేర్కొన్నారు. డప్పు తమ సంస్కృతి, ఆయుధం, ఆభరణమని అన్నారు. వేయి డప్పుల ర్యాలీకి వేముల వీరేశం, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, తూంకుంట నరసా రెడ్డి, బీర్ల ఐలయ్య తదితరులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మాదిగలు ఎవరి చావునూ కోరుకోరని, రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని, వాటిని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరారు. మాదిగలు, దళితులు, మహిళలకు వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన దళిత బంధు, 3 ఎకరాల భూ పంపిణీ, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం, కళ్యాణ లక్ష్మి, గురుకులాలు, సాంస్కృతిక సారధి వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 22ఏ పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. డప్పు కళాకారులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.