అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన విలేకరి చింతల ఐలయ్య శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో మృతిచెందారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రజా ప్రతిజ్ఞ దినపత్రికలో పెద్దవంగర మండల విలేకరిగా గత కొన్నేళ్లుగా విధులు నిర్వర్తించారు. గతంలో వివిధ తెలుగు దినపత్రికల్లో పనిచేసి ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దవంగర మండల కేంద్రంగా కీలకంగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతదేహానికి స్వస్థలం గట్లకుంట గ్రామంలో పెద్దవంగర మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామ్మూర్తి, సభ్యులు బుచ్చన్న, యాకన్న, వేణు, రాజు, మల్లేష్, మధు, బాలాజీ, మురళి, సతీష్, రత్నాకర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

