epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం
పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు
మార్కెట్‌ ఒడిదుడుకులను అధిగమించాలి
సేంద్రియ ఎరువుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి
రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 
జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద
కాకతీయ, గీసుగొండ : ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందడంతో పాటు పంటల వైవిధ్యీకరణ ద్వారా వాతావరణ మార్పులు, మార్కెట్‌ ఒడిదుడుకులను అధిగమించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేయాలని, తక్కువ నీటితో మెరుగైన దిగుబడుల కోసం బిందు సేద్యం, తుంపర సేద్యం, మల్చింగ్‌ పద్ధతులను వినియోగించాలని తెలిపారు. కోనాయిమాకుల రైతు వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌, వివిధ కూరగాయల పంటల రైతులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజ్వల్‌ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి సేంద్రియ ఉత్పత్తులను పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉద్యాన శాఖ రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం
బయో ఇన్‌పుట్‌ కేంద్రాల ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్‌, సిటీ కంపోస్ట్‌, వర్మీ వాష్‌, వర్మిటీ, వావిలాకు కషాయం, జీవామృతం, వేస్ట్‌ డీకంపోజర్‌ తదితర ఉత్పత్తులను రైతులకు పరిచయం చేశారు. సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన పంటలు పండించవచ్చని వివరించారు. లింగాకర్షణ బుట్టలు, జిగురు రంగు అట్టలు, వ్యక్తిగత రక్షణ పరికరాలను రాయితీపై అందుబాటులో ఉంచారు. వరంగల్‌ గోల్డ్‌, సిటీ కంపోస్ట్‌ ఉత్పత్తులను కలెక్టర్‌ అభినందించారు. లక్ష్మీపురం డంపింగ్‌ యార్డు వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్‌ చేసి సేంద్రియ ఎరువులుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.
400 మంది రైతులు పాల్గొన్నారు
శాస్త్రవేత్తలు కూరగాయల ఆధునిక సాగు, నేల ఆరోగ్యం, మొక్కల సంరక్షణ, తెగుళ్ల నివారణ, సమగ్ర సస్యరక్షణపై అవగాహన కల్పించారు. వరంగల్‌ ఆర్డీఓ సుమ, గీసుగొండ తహసీల్దార్‌ ఎం.డి.రియాజుద్దీన్‌, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఆర్‌.శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్‌బాబు, ప్రజ్వల్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పెద్దపల్లి రామ్మూర్తి, ప్రాజెక్టు మేనేజర్‌ ఇన్నారెడ్డి, సమాచార నిర్వహణ వ్యవస్థ సమన్వయకర్త అక్కల రమేష్‌, యూనిట్‌ మేనేజర్‌ అయేషా, అధికారులు, సర్పంచులు, వివిధ రంగాల ప్రతినిధులు, సుమారు 400 మంది రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.