epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?
తీరని బస్ స్టాండ్  కష్టాలు..
చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ అధికారులు 
రూ.5 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన మూత్రశాలల నిర్మాణం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు,వృద్ధులు 
తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల  డిమాండ్
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సుమారు బస్టాండ్ ప్రారంభమై 6 సంవత్సరాల 9 నెలలు పూర్తవుతున్నప్పటికీ,నేటికీ ప్రయాణికుల కోసం మూత్రశాలలు నిర్మించకపోవడం శోచనీయం.నిత్యం వందలాదిమంది ప్రయాణికులు,విద్యార్థులు,ఉద్యోగులు, వరంగల్,ఖమ్మం,తొర్రూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.మూత్రశాలలు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు,చిన్నపిల్లలు,వృద్ధులు,గర్భిణీల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.కొంతమంది ప్రయాణికులు బస్టాండ్ కాంప్లెక్స్ వెనుక భాగంలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు.దింతో బస్టాండ్ పరిసర ప్రాంతంలోని సమీప నివాసితులు,వ్యాపారులు దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బస్టాండ్ ప్రాంగణంలో ఏళ్లు గడుస్తున్నా..మూత్రశాలలు ఏవి స్వామి? అంటూ ప్రయాణికులు,స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.
 రూ.5 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా?
 ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డిఎఫ్) నుంచి సుమారు రూ.5 లక్షలు వెచ్చించి మూత్రశాలల నిర్మాణం చేపట్టారు.అయితే..ఆ నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయి కేవలం పిల్లర్లు,స్లాబ్ స్థాయికే పరిమితమైంది.స్లాబ్ పోసి అర్ధాంతరంగా పనిని మధ్యలోనే వదిలేయడంతో లక్షల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అరకొరగా మిగిలిపోయిన మూత్రశాలల నిర్మాణం ఇప్పుడు చెత్త చెదారంతో పాడుబడిన భవనంలా దర్శనమిస్తోందని మండిపడుతున్నారు.
అధికారుల ఉదాసీనత :
‘స్వచ్ఛత’ గురించి ఉపన్యాసాలు దంచికొట్టే ప్రజాప్రతినిధులు,అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు,పంచాయతీ పాలకులు తక్షణమే స్పందించి రాయపర్తి బస్టాండ్ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న మూత్రశాలల నిర్మాణం తక్షణమే పూర్తి చేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 నిధులు విడుదల కాకపోవడం వల్లే పనులు ఆగాయి 
 పంచాయతీ కార్యదర్శి యాకుబ్ నాయక్ 
గతంలో మూత్రశాలల నిర్మాణానికి మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డిఎఫ్) ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్లే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని అన్నారు.అప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బకాయి బిల్లులు చెల్లిస్తే తప్ప,తదుపరి పనులు ప్రారంభించబోమని కాంట్రాక్టర్ స్పష్టం చేశారని తెలిపారు.నిధుల విడుదల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కార్యదర్శి యాకుబ్ నాయక్ వివరణ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.