epaper
Sunday, October 18, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క

32 మంది లబ్ధిదారులకు రూ.32.03 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

కాకతీయ, ములుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్‌ ప్రాంగణం పూలవనంలా మారగా, మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడి సందడి చేశారు.

మహిళలు శాసించే స్థాయికి ఎదగాలి

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మహిళలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

32 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రజల్లో ఐక్యత, ఆనందాన్ని పెంపొందిస్తుందని అన్నారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క ములుగు మండలానికి చెందిన 25 మంది, మల్లంపల్లి మండలానికి చెందిన ఏడుగురు కలిపి మొత్తం 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్లు సీహెచ్‌ మహేందర్‌ జి, సంపత్‌రావు, ములుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా షాహిన్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ భగవాన్‌రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీ రామగిరి...

సారే కావాలంటున్నారు..

సారే కావాలంటున్నారు.. కేసీఆరే మ‌ళ్లీ రావాలంటున్నారు.. బీఆర్ఎస్‌ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్‌...

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ...

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.