epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ అభ్యర్థి..

ఎమ్మెల్సీ అభ్యర్థి..
డా.శ్రీకాంత్ గౌడ్ కు అభినందనల వెల్లువ

కాకతీయ, ఇనుగుర్తి : తెలంగాణ మలిదశ ఉద్యమ నేత బీసీ ముద్దుబిడ్డ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ను వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో శ్రీకాంత్ గౌడ్ అభినందనల పరంపర కొనసాగుతోంది. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్ ,షేక్ రజాక్ ప్రభృతులు శ్రీకాంత్ గౌడ్ ను కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు. టికెట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ గౌడ్ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విధితమే. పీహెచ్డీ పట్టాపొం దిన విద్యాధికులు డా. శ్రీకాంత్ గౌడ్ కు ప్రజా సమస్యల తో పాటు విద్యారంగం, నిరుద్యోగం,కార్మిక,కర్షిక వెరసి అన్ని సమస్యల పై అపారమైన విషయ పరిజ్ఞానం కలిగి ఉండడం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న శ్రీకాంత్ గౌడ్ ను గ్రాడ్యుయేట్లు,అనేక సంఘాల నాయకులు విద్యావంతులు మేధావుల నుంచి అనూహ్యమైన మద్దతు అభినందనలు కొనసాగుతున్నాయి. విజయదశమి పురస్కరించుకొని శ్రీకాంత్ గౌడ్ స్వగ్రామం చిన్ననాగారానికి రావడంతో విషయం తెలుసుకున్న ఇనుగుర్తి మండల గ్రాడ్యుయేట్లు మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు తినిపించారు.

కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాంత్ గౌడ్..

ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమను గుర్తించి తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, తన అభ్యర్థిత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటిస్తున్న వారందరికీ డా.శ్రీకాంత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై పోరాడుతూ నిరంతరం అందుబాటులో ఉండే తనకు అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ప్రజల పక్షాన బరి గీసి పోరాడే తనకు పట్టభద్రులు మద్దతు పలకాలని అభ్యర్థించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.