epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓట్ల చోరీని అడ్డుకుంటాం!

ఓట్ల చోరీని అడ్డుకుంటాం!
ఓటర్ల జాబితాలో అక్రమాలపై కాంగ్రెస్‌ సమరం
ప్రతి బూత్‌లో తొలగించిన ఓట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ మూడో దశ కార్యాచరణ ఖరారు
రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పోరాటం
ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్‌ నాయుడు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల

కాకతీయ, హన్మ‌కొండ : కేంద్ర ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్‌ నాయుడు, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి విమర్శించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 26న హనుమకొండ జిల్లా డీసీసీ భవన్‌లో ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉద్యమ మూడో దశ కార్యాచరణ సమావేశంలో వారు మాట్లాడారు. మొదటి, రెండో దశలను పూర్తి చేసుకున్న ఉద్యమాన్ని ఇప్పుడు ప్రతి బ్లాక్‌, బూత్‌, గ్రామస్థాయికి విస్తరించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ప్రతి బూత్‌లో ఓట్ల పరిశీలన

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, బూత్‌ స్థాయి ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తామని నేతలు తెలిపారు. ఏఐసీసీ డిజిటల్‌ వేదిక ‘ఓట్‌ రక్షక్‌’ వినియోగంపై బూత్‌ ఏజెంట్లు, స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, అక్రమంగా తొలగించిన లేదా మార్చిన ఓట్ల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సంతకాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత అంశాలను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఓటర్లు, గ్రామ పెద్దలు, యువకులు, పంచాయతీ ప్రతినిధులతో సంప్రదాయ మంచాల సమావేశాల తరహాలో ‘గ్రామ చౌపాల్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. దేశ ప్రజల భవిష్యత్తు కోసం రాహుల్‌ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని, రాబోయే రోజుల్లో ఆయనే ప్రధానమంత్రి అవుతారని కేబీఆర్‌ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. నవంబర్‌ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే జాతీయ ర్యాలీతో పాటు నవంబర్‌ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ‘దిల్లీ చలో’ కార్యక్రమానికి జిల్లా నుంచి మద్దతు తెలుపుతామని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ సమన్వయకర్త అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కె.ఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, టీపీసీసీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‌ గుండు సుధారాణి, మేర కోఆపరేటివ్‌ చైర్మన్‌ సంగ వెంకట్రాజం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ సభ్యుడు భట్టి శ్రీనివాస్‌రావు, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయ్యూబ్‌, వరంగల్‌ గ్రెయిన్‌ మార్కెట్‌ చైర్మన్‌ పులి ప్రియాంక, సాగరిక రావు, మాజీ కార్పొరేటర్లు, మండల, డివిజన్‌ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

వరంగల్‌ డీసీసీబీకి రూ.10.23 కోట్ల లాభం

వరంగల్‌ డీసీసీబీకి రూ.10.23 కోట్ల లాభం సహకార సంఘాలకు కొత్త పంట రుణాల...

పెద్దవంగర పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌

పెద్దవంగర పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కాకతీయ, పెద్దవంగర: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ...

రైతుల ధాన్యం కష్టాలు పట్టించుకోరా?

రైతుల ధాన్యం కష్టాలు పట్టించుకోరా? విత్తనాల కోసం సెల్ఫ్‌ డిక్లరేషన్‌పై సంతకాల ఒత్తిడి రైతుల...

తమ్మిడిహెట్టి పేరుతో మోసం!

తమ్మిడిహెట్టి పేరుతో మోసం! నీళ్లపై అవగాహన లేకుండా ప్రాజెక్టులపై ప్రచారమా? మేడిగడ్డ సాకుతో వార్ధా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.