epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!
కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు.. 
116 అర్జీలతో బల్దియా సమస్యల చిట్టా
ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్‌ ఎదుట తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్‌, పార్కుల నిర్వహణ, ఆక్రమణలు తదితర అంశాలపై మొత్తం 116 ఫిర్యాదులు అందాయి. 26వ డివిజన్‌ లక్ష్మీపురంలో ప్రభుత్వ కాలువను మూసివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. 56వ డివిజన్‌ వెంకటేశ్వర కాలనీలో పన్నులు చెల్లిస్తున్నా నాలుగేళ్లుగా తాగునీరు రావడం లేదని వాపోయారు. 21వ డివిజన్‌ ఎల్‌బీనగర్‌లో 20 అడుగుల రహదారికి గేటు అడ్డుగా నిర్మించారని, 64వ డివిజన్‌ టేకులగూడెంలో సీసీ రోడ్డుపై మెట్లు, కాలువ పూడ్చివేతపై రెండోసారి ఫిర్యాదు అందింది. 27వ డివిజన్‌ గిర్రాజిపేటలో 60 ఏళ్లుగా రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. లాల్‌జీ దొడ్డిలో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ తొలగింపుతో 15 ఇళ్లు చీకట్లో మగ్గుతున్నాయని 11 కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. గుడిమళ్ల కాంప్లెక్స్‌ వద్ద పార్కింగ్‌ స్థలం ఆక్రమణతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని 11 మంది జ్యువెలరీ వ్యాపారులు విన్నవించారు. లేబర్‌ కాలనీలో దుర్గమ్మ చెరువు పార్కు చెత్తకుప్పగా మారిందని, కృష్ణానగర్‌లో డ్రైనేజీ లీకేజీతో రెండేళ్లుగా ఇళ్ల గోడల్లోకి మురుగునీరు వస్తోందని ఫిర్యాదులు అందాయి.
ఫైళ్లకే పరిమితమవుతాయా.. చర్యలు తీసుకుంటారా?
ఒకేరోజు 116 ఫిర్యాదులు రావడం, కొన్ని సమస్యలపై రెండోసారి అర్జీలు సమర్పించాల్సి రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కమిషనర్‌ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారా.. లేక అర్జీలు ఫైళ్లకే పరిమితమవుతాయా అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి 20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ,...

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అర్హులైన...

పత్తి రైతును దోచేస్తున్న దళారులు

పత్తి రైతును దోచేస్తున్న దళారులు * పత్తి ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.