epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పత్తి రైతును దోచేస్తున్న దళారులు

పత్తి రైతును దోచేస్తున్న దళారులు
* పత్తి ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర నష్టం
* మార్కెట్లో వే బ్రిడ్జిలు పనిచేయకపోవడం సిగ్గుచేటు
* పత్తి క్వింటాకు రూ.12 వేల మద్దతు ధర ఇవ్వాలి.. ఏఐకేఎఫ్
* ఏనుమాముల మార్కెట్ లో ఏఐకేఎఫ్ బృందం పరిశీలన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రామాల్లో చిల్లర కాంటాలతో మధ్య దళారులు పత్తి రైతులను దోచుకుంటున్నారని, మార్కెట్లో ధరల వ్యత్యాసంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. సోమవారం ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రతినిధి బృందం వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి రైతులు తీసుకువచ్చిన పత్తి ధరలు, వారి ఇబ్బందులు, జరుగుతున్న మోసాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయంగా పత్తి విస్తీర్ణం, దిగుబడి తగ్గి డిమాండ్ ఉన్నా ధరలు పెరగకపోగా తగ్గించడం అన్యాయమని, ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాములలో ఈ సీజన్లో ఒక్కసారి కూడా హైరేట్ పలకకపోవడం, జెండా పాట పేరుతో కొందరికే ఎక్కువ ధర ఇచ్చి మిగతా వారికి క్వింటాకు 500 నుండి 600 రూపాయలు తక్కువకు కొనుగోలు చేయడం దారుణమన్నారు. మార్కెట్లో 4 వే బ్రిడ్జిలు ఉన్నా ఒక్కటీ పనిచేయకపోవడం సిగ్గుచేటని, లూజు పత్తికి బయట తూకం వేసి మార్కెట్లో ధర తగ్గించడం, గ్రామాల్లో చిల్లర కాంటాలతో తూకంలో మోసం చేయడం జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా చిల్లర కాంటాలను అరికట్టి ధరల వ్యత్యాసాన్ని తొలగించి జెండా పాట అందరికీ వర్తింపజేయాలని, మార్కెట్లో రైతులు, కార్మికులకు నాణ్యమైన ఉచిత భోజనం అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి క్వింటాకు 12 వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక, కార్యదర్శి నిషాని శ్రీనివాస్ లకు అందజేయగా వారు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. రెడ్డి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కుసుంబ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి 20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ,...

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అర్హులైన...

భూ భకాసురులకు అండగా పాలకులు

భూ భకాసురులకు అండగా పాలకులు వైఎస్సార్‌ నగర్‌ పేదలకు పట్టాలిచ్చి.. పక్కా ఇళ్లు...

గ్రేటర్‌ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి!

గ్రేటర్‌ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి! అవసరమైతే అడహాక్‌ కమిటీ ఏర్పాటు చేయాలి బైలా నిబంధనలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.