కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన…
మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత…
మహిళా, ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటు…
కాకతీయ, గీసుగొండ: కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలు–2026లో భాగంగా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాడి శివ పేరును గతంలోనే ప్రకటించగా, తాజాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, మండల పార్టీ అధ్యక్షుడు దాడి శివ సంయుక్తంగా మండల పూర్తి కమిటీతోపాటు మహిళా, ఎస్సీ సెల్ కమిటీలను ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయికి విస్తరించడంతోపాటు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా జన్ను రమేష్, బాదావత్ రమేష్, నల్ల సురేష్, ప్రధాన కార్యదర్శులుగా నకినబోయిన నాగరాజు, కొమ్ము శ్రీకాంత్, చల్లా కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా మారడోజు వేణు, కందారి సంతోష్, జల్లెల రవి, తుమ్మనపల్లి బాబురావు, కందికొండ రాజు, జూల రమేష్‌లను నియమించారు. కోశాధికారిగా కొల సునీల్‌తోపాటు కౌడగాని సతీష్, ఎండీ హుస్సేన్, ఆగుల రాజును ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా సహింపు వెంకటేశ్వర్లు, భూక్య రాంబాబు, మర్రి రాజలింగం, గడ్డమీది రమేష్‌లను నియమించారు. మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా మాదాసి కళ్యాణి, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి సునీత, తుమ్మ నిర్మల జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము సబిత, కార్యదర్శులుగా చిలంకురి లిల్లీ మేరీ, ఊరుగొండ అనిత, కోశాధికారిగా చేతరాశి అన్నపూర్ణను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా మంద మల్లికాంబ, కొంగర అంబిక, పులిచేరి మంజులకు అవకాశం కల్పించారు. ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా కొమ్ముల వినయ్, ఉపాధ్యక్షులుగా కాయిత అఖిల్, కోట ప్రణయ్, ప్రధాన కార్యదర్శిగా మంద రాజు, కార్యదర్శులుగా డక్క కుమారస్వామి, కొంగర సారిబాబు, కోశాధికారిగా కొరవి రమేష్‌లను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా జన్ను ప్రశాంత్, కుక్కముడి రాజేష్, నమిండ్ల కుమారస్వామి, పసునూటి శ్యాంసుందర్, వనపాకల సాంబయ్య, చిరుపూరి కోటి, గుండా లక్ష్మణ్, మంద సారంగంలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడి శివ మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనతోపాటు నూతన కమిటీలో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తామని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యువతకు, మహిళలకు, ఎస్సీ వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం ద్వారా అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని దాడి శివ తెలిపారు.

