epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు!

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు!
రూ.5.92 లక్షల విలువైన 2,250 కిలోల సరుకు పట్టివేత
ఒకరి అరెస్ట్‌.. ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అప్పగింత
కాకతీయ, వరంగల్ : మట్వాడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కల్తీ కారం, పసుపు పొడుల నిల్వలు, విక్రయాల వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి రూ.5,92,500 విలువైన 2,250 కిలోల పొడులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో 600 కిలోల కారం పొడి, 1,650 కిలోల పసుపు పొడి ఉన్నాయి. తనిఖీల్లో ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం నిర్వహించడం, లేబుళ్లు లేకుండా ప్యాకింగ్‌ చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో పొడులను ప్యాక్‌ చేయడం గుర్తించారు. కార్మికులకు తల కవర్లు, మాస్కులు, చేతి తొడుగులు లేకపోవడంతో పాటు వైద్య ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలు కూడా లేవని అధికారులు గుర్తించారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును ఫుడ్‌ సేఫ్టీ అధికారి చి. మౌనికకు అప్పగించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ. మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ వి. క్రాంతికుమార్‌, ఎస్సై కె. సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం అటవీ సంరక్షణకు పోలీసు, అటవీ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి...

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా...

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి 90 శాతం పూర్తయిన నిర్మాణ...

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ పరశురాములు కాకతీయ, పెద్దవంగర...

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా 

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా  పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్   కాకతీయ,రాయపర్తి : బీసీల...

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ...

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.