epaper
Sunday, November 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గొల్లకురుమలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

గొల్లకురుమలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదు….
జిఏమ్ పిఎస్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ హెచ్చరిక….
కాకతీయ,చెన్నారావుపేట: గొల్లకురుమలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జీ ఏమ్ పి ఏస్ వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ డిమాండ్ చేశారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జి ఏమ్ పి ఏస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సమయంలో గొల్లకురుమలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం  ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారులకు 2 లక్షల నగదు అందిస్తామని ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయకపోవడం సరికాదన్నారు. గొర్రెలు మేపుతూ ప్రమాదవశాత్తు మరణించే కాపరుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించి విస్మరించిందని మండిపడ్డారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న గొల్లకురుమ యువతకు 50 లక్షలతో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. కల్లుగీత, చేనేత కార్మికుల తరహాలో 50 ఏళ్లు నిండిన గొల్లకురుమలకు నెలవారీ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు ప్రతి గ్రామంలో పశువైద్యశాల ఏర్పాటు చేయాలని, మూగజీవాలకు అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గొల్లకురుమల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.ఈ
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మత్తుర్తి అన్వేష్, జీ ఏమ్ పి ఏస్ జిల్లా కమిటీ సభ్యులు బోయిని రాజు, కుక్కల సతీష్, లెంకలపల్లి రాజు, గుండు బాలకృష్ణ, లంకలపల్లి కరుణాకర్, కుక్కల రాజు, కసరబోయిన కుమార్, కుక్కల మల్లయ్య, లంకలపల్లి ముండయ్య, కుర్రు రవికుమార్, కుక్కల సాంబయ్య, కుక్కల ఐలయ్య, కసరబోయిన రాజకుమార్, భూక్య నామా తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులను పరిశీలించిన డీపీఓ కె.కల్పన సమిష్టి కృషితోనే...

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు! కోచ్‌ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు...

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా దార్ల భాస్కర్, ప్రధాన...

చారిత్రక సంపదకు భరోసా!

చారిత్రక సంపదకు భరోసా! రామప్ప పరిరక్షణపై ఎన్‌జీటీ సుమోటో ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలతో ఆలయం, చెరువుకు...

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యుడు...

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు.. విద్యార్థులకు స్వీట్లు...

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి అధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య దిశానిర్దేశం కాకతీయ, హన్మ‌కొండ...

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది సిబ్బందికి నగదు రివార్డులు అందించిన సీపీ ఎన్‌.శ్వేత కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.