ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం
హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు.. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ
కాకతీయ, హనుమకొండ : బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన ప్రత్యేక విద్యార్థులు తయారుచేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను సందర్శించిన సీపీ, వారి సృజనాత్మకత, నైపుణ్యాలను అభినందించారు. ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, సురేష్, ఆర్ఐలు సర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల, ఈసీ సభ్యుడు కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.

