బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శ
కాకతీయ, పెద్దవంగర : పలు బాధిత కుటుంబాలను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శనివారం పరామర్శించారు. మండల కేంద్రంలోని వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండారి వెంకన్న తల్లి,పెద్దవంగర గ్రామానికి చెందిన చిలుక బుచ్చమ్మ, వల్లపు రామస్వామి, చిన్నవంగర గ్రామానికి చెందిన పాకనాటి దేవేందర్ రెడ్డి,ధరవాత్ లచ్చిరాం,గుంటుక సురేష్,బోడేపల్లి నాగేష్,చిట్యాల గ్రామానికి చెందిన దండు హరీష్, ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన దుంపల శ్యామ్ లా కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు ముద్దసాని సురేష్, నాయకులు రవీందర్ రెడ్డి,హరికృష్ణ, కృష్ణ,నగేష్, దేవా, ఉపేందర్ రెడ్డి, రాము రెడ్డి, రాందయాకర్ రెడ్డి, గోపాల్ నాయక్,రహీమ్ పాషా,వేణు, సతీష్, నరేష్, సైదులు, మహేష్,శ్రీనివాస్,రవి, మహేందర్, వెంకన్న, పరమేష్,నాయక్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

