ట్రస్మ జిల్లా టోర్నమెంట్లో సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు
కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లాలో ట్రస్మా (తెలంగాణ రెగ్యునైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని జమాల్లపల్లి విద్యా భారతి హై స్కూల్ లో జిల్లా స్థాయి టోర్నమెంట్ విద్యార్థిని విద్యార్థులకు పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలలో ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అన్ని విభాగాలలో 5 బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ భారతి, ట్రస్మా అధ్యక్షులు ఏకాంతం గౌడ్ చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులను అన్ని రంగాలలో మరియు క్రీడారంగంలో ప్రోత్సహించాలని ఇటువంటి టోర్నమెంట్ కు తీసుకపోవడం జరుగుతుందని ఈ టోర్నమెంట్ లో మా పాఠశాల వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ పిల్లలు చక్కని ప్రతిభ కనబరిచి అత్యధిక బహుమతులు గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా బహుమతులు గెలుపొందిన విద్యార్థులైన నునావత్ రిషి రెండు బహుమతులు ,ముల్క కార్తీక ,బూర ఆయన్ తేజ్, తహసీన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీలత టీచర్ పాల్గొన్నారు.

