epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!
మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి
మహిళలు బాగుపడితేనే కుటుంబం బాగుపడుతుంది
బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోంది.. ఎంపీ కడియం కావ్య
బీఆర్ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజాబలంతో తిప్పికొడతాం : ఎమ్మెల్యే రేవూరి

కాకతీయ, గీసుగొండ: ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మహిళలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోవాలని, వారు బాగుపడితే కుటుంబం బాగుపడుతుందని పేర్కొన్నారు. గీసుగొండ మండలం శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పైలాన్‌ వద్ద బుధ‌వారం పరకాల నియోజకవర్గంలో రూ.40.95 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నూతన చేయూత పింఛన్ల పంపిణీ, హెచ్‌ఏఎం పద్ధతిలో రహదారుల నిర్మాణం, పరకాల ఇందిరా మహిళా డెయిరీ పాల సేకరణ కేంద్ర భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 4,63,000 మంది అర్హులకు చేయూత పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. వీరిలో 3,63,000 మంది మహిళలే ఉండటం మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు అందించి నెలకు రూ.70 వేల ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు.

మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఇందిరాగాంధీ చిన్నతనంలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న తండ్రి జైలుకు వెళ్లినా, వివాహానంతరం భర్తను కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా దేశ తొలి మహిళా ప్రధానిగా ఎదిగి ఉక్కు మహిళగా పేరు సంపాదించారని సీతక్క వివరించారు. ఆమె స్ఫూర్తి మహిళల్లో కలగాలనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెడుతున్నామని తెలిపారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం చేపట్టామన్నారు. రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు వచ్చి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్ఐఆర్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు రానున్న రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక బీఆర్ఎస్‌ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తమకు పత్రికలు, టీవీ ఛానళ్ల బలం లేదని, ప్రజాబలమే అసలైన బలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్‌ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, జడ్పీ సీఈఓ వసంత, తహసీల్దార్లు ఎం.డి. రియాజుద్దీన్‌, రాజ్‌కుమార్‌, ఎంపీడీఓలు శ్రీధర్‌, రవీందర్‌, గీసుగొండ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాడి శివ, సంగెం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం!

వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం! జీడబ్ల్యూఎంసీ–ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌ సంయుక్తంగా వేస్ట్‌ ఆడిట్‌కు శ్రీకారం 90 ఇళ్లతో...

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు...

ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ!

ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ! సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశపై...

నిట్‌–కిట్స్‌ మధ్య బలోపేతమైన విద్యా బంధం

నిట్‌–కిట్స్‌ మధ్య బలోపేతమైన విద్యా బంధం పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు సంయుక్త పరిశోధనలు,...

ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ!

ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ! బెడ్‌షీట్లు ఎప్పటికప్పుడు మార్చాలి.. పరిశుభ్రత పాటించాలి భద్రతా సిబ్బంది...

పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు!

పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు! పోచంపల్లి ఫౌండేషన్‌ ద్వారా అభివృద్ధి పనులు వరంగల్‌...

అచ్చ విద్యాసాగర్‌కు నాగుర్ల ఘన నివాళి

అచ్చ విద్యాసాగర్‌కు నాగుర్ల ఘన నివాళి తెలంగాణ ఉద్యమ సహచరుడి మృతిపై సంతాపం కాకతీయ,...

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి స్థానిక మండలంలో కాంగ్రెస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.