epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాళేశ్వ‌రానికి రిపేర్లు

  • బ్యారేజీ మ‌రమ్మ‌తుల‌కు టెండ‌ర్లు
  • తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
  • ఇరిగేష‌న్ అధికారుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని సంక‌ల్పించింది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికోసం ఈనెల 15 వరకు గడువు విధించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దెబ్బతిన్న బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగానే పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరదల తర్వాత భౌతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్డీఎస్ఏ రికమండేషన్స్ ఆధారంగా వీలైనంత త్వరగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రభుత్వం మరమ్మతు చేసేందుకు సిద్ధ‌మైంది.

రాజ‌కీయ అంశాల‌కు తావులేదు

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మద్యంతర నివేదికలోనే రికమండేషన్స్ ఆధారంగానే ప్ర‌భుత్వం రిపేర్ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. మ‌ర‌మ్మ‌తుల కోసం ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఎన్ డి ఎస్ ఏ రికమండేషన్స్ లో ఏమున్నాయి ? ఎవరెవరు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది? దేనికి ఎంత ఖర్చు అవుతుంది ? అనే అంశాలపై రెండు, మూడు రోజుల్లో రిపోర్టు రెడీ చేసి ఇవ్వాలని నీటిపారుద‌ల శాఖ ఉన్న‌తాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థతోనే పెట్టించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎవరి నిర్లక్ష్యంతో తప్పు జరిగినప్పటికీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోణంలో ఉంటాయే తప్ప… రాజకీయ అంశాలతో ముడిపడి ఉండవని, అధికారులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఎలా ముందుకెళ్లాలి..

కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో సమస్యలు తలెత్తాయ‌ని ఎన్‌డీఎస్ఏ తెలిపింది. 2019లో డ్యామేజీ జరిగిందని నివేదిక‌లో పేర్కొంది. వాటిని అప్పుడే గుర్తించి రిపేర్లు చేపట్టి ఉంటే మిగతా పిల్లర్ల‌కు సమస్యలు వచ్చేవి కాదని స్పష్టం చేసింది. ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి ఉంటుంది. రిపేర్లకు సంబంధించిన ఖర్చులు అంశాన్ని కూడా ఎన్డీఎస్ ఏ కంటే ముందే రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ సంస్థతో చర్చించింది. అవసరమైన ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పగా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్‌డీఎస్ ఏ రికమండేషన్స్ రావడంతో వాడికి తగ్గట్లుగా మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎవరెవరు ఎక్కడ ఏమి పని చేయాలనే దానిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. ఎంత వరకు మరమ్మ‌తులు చేయగలరు? చేసిన తర్వాత కూడా మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై ఇంజినీర్ల బృంధం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఒక్క బ్యారేజీ త‌ర్వాత మ‌రొక్క‌టి కాకుండా మూడింటిలో ఉన్న డ్యామేజీలకు ఒకేసారి రిపేర్లు మొద‌లుపెట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

వైబ్‌సైట్లో పూర్తి వివ‌రాలు..

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం మూడు గంటలలోపు సమర్పించాల్సి ఉంది. అదేవిధంగా అక్టోబర్ 15న సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలంగాణ నీటిపారుదల వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.