epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ‌యాగ్రాల‌తో హ‌త్య‌కు ప్లాన్‌..!

  • 15 మాత్ర‌లు ఒకేసారి భోజ‌నంలో క‌లిపిన భార్య‌
  • క‌రీంన‌గ‌ర్ లో హ‌త్య కేసును చేధించిన పోలీసులు
  • ద‌ర్యాప్తులో షాక్ గురి చేసే నిజాలు వెలుగులోకి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌త్తి సురేష్ హ‌త్య‌కేసును క‌రీంన‌గ‌ర్ పోలీసులు చేధించారు. తాగుడుకు బానిసై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న క‌త్తి సురేష్‌ను (36) భార్య మౌనిక మ‌ద్యంలో నిద్ర‌మాత్రలు క‌లిపి అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్నాకా.. కిటీకి చీర‌తో ఉరివేసి చంపేసిన‌ట్లు క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం వెల్ల‌డించారు. ఈ హ‌త్య‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రించిన మొత్తం ఐదుగురిని కూడా అరెస్టు చేసిన‌ట్లు సీపీ తెలిపారు. సెప్టెంబరు 17న క‌రీంన‌గ‌ర్ జిల్లాకేంద్రంలో అనుమానాస్ప‌ద స్థితిలో క‌త్తి సురేష్ మ‌ర‌ణించాడు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యే హంత‌కురాలిగా గుర్తించారు. ఈ కేసులో మృతు భార్యతో పాటు మొత్తం ఆరుగురు నిందితులను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివ‌రాల‌ను గురువారం క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం త‌న కార్యాల‌యంలో మీడియాకు వెల్ల‌డించారు. సీపీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌ట్ట‌ణానికి చెందిన‌ కత్తి సురేష్ (36) కు 2015లో మౌనిక (29)ను ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

భ‌ర్త వేధింపుల‌తో హ‌త్య‌కు ప్లాన్‌..

సురేష్ మ‌ద్యానికి బానిస కావ‌డంతో ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఈక్ర‌మంలోనే ఆమెకు దొమ్మాటి అజయ్ (28)తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. భర్త తరచూ డబ్బు కోసం వేధించడమే కాకుండా తన స్వేచ్ఛకు అడ్డు వ‌స్తున్నాడ‌నే నెపంతో సురేష్‌ను హ‌త్య చేయాల‌ని మౌనిక ప‌థ‌కం ర‌చించింది. ఇందుకు తన స‌మీప‌ బంధువు అరిగే శ్రీజ (32)తో ఈ విష‌యంపై చ‌ర్చించింది. త‌న‌కు ప‌రిచ‌య‌స్తుడైన మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ (27)కు మౌనిక‌ను శ్రీజ ప‌రిచ‌యం చేసింది. వీరితో పాటు త‌న మిత్రురాలు వేముల రాధ అలియాస్ నల్ల సంధ్య (39), ఆమె భర్త నల్ల దేవదాస్ (49)లకు సైతం పరిచయం చేసింది. సురేష్‌ను చంపేందుకు ర‌క‌ర‌కాల ఆలోచ‌నల పంచుకున్నారు.

భోజ‌నంలో 15 వ‌యాగ్రా మాత్ర‌లు..

ఒక రోజు సురేష్‌కు భోజనంలో 15వ‌యాగ్రా మాత్ర‌ల‌ను ఒకేసారి భోజ‌నంలో క‌లిపి ఇవ్వ‌డంతో భోజ‌నం ఏదో వాస‌న వ‌స్తోంద‌ని తిన‌డానికి సురేష్ నిరాక‌రించాడు. అయితే గ‌త నెల 17న మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ సూచన మేరకు, టెల్మికిండ్-(హెచ్‌80) (బీపీ మందులు), ట్రైకా (నిద్ర మాత్రలు) మిశ్రమాన్ని మద్యంలో కలిపి ఇవ్వ‌డంతో సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత‌ చీరను కిటికీ గ్రిల్‌కు కట్టి దాన్ని సురేష్ మెడకు చుట్టి గట్టిగా లాగి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె తన అత్తమామలకు ఫోన్ చేసి, లైంగిక చర్య సమయంలో భర్త స్పృహ కోల్పోయాడని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది.

కుటుంబ స‌భ్యుల అనుమానంతో వెలుగులోకి..!

ఘ‌ట‌న జ‌రిగిన తీరుపై సురేష్ కుటుంబ స‌భ్యులు, బంధువులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో సురేష్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శాస్త్రీయ ఆధారాలతో సహా టెక్నికల్ ఎనాలసిస్‌లో హ‌త్య‌గా నిర్ధార‌ణ కావ‌డం, దర్యాప్తులో మౌనికతో పాటు మిగతా ఐదుగురు నిందితులు కూడా హత్యకు కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నార‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం తెలిపారు. నిందితుల మధ్య జరిగిన చాట్‌లు, వాడిన మందులు, మద్యం బాటిళ్లు తదితర అంశాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారిని న్యాయపరమైన కస్టడీకి అప్పగించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కరీంనగర్ ఏసీబీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, వారి బృందం కీలక పాత్ర పోషించడంతో వారి దర్యాప్తును కమిషనర్ గౌస్‌ ఆలం అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.