epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

` థామా` రిలీజ్ స్పెషల్: రష్మిక షేర్ చేసిన షూటింగ్ అనుభవాలు

కాక‌తీయ‌, సినిమాః నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, ఆయుష్మాన్ ఖురానా మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ` థామా`. ఈ రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ ద‌ర్శ‌కుడు. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ థామా మూవీని నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబ‌ర్ 21న రిలీజ్ అయిన థామాకు ప్రేక్ష‌కుల నుంచి పాటిజివ్ టాక్ ల‌భించింది. అద‌లా ఉంటే.. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సెట్‌లో తీసిన కొన్ని బీటీఎస్ ఫోటోల‌ను ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ షూటింగ్ అనుభ‌వాల‌ను పంచుకున్నారు.  థామా.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. మొదటి కాల్‌షీట్‌ నుంచి చివరి కట్‌ వరకు – ఈ సినిమా నాకు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు… ఇది నా మనసుతో చేసిన ప్రయాణం. ఇందులో నవ్వులు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, అలసటతో మేల్కొనాలనిపించని ఉదయాలు ఉన్నాయి, ముగియకూడదనిపించిన రాత్రులు ఉన్నాయి.

నన్ను నమ్మి ‘తడాక’ పాత్రలో అవకాశం ఇచ్చినందుకు, నాలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తెచ్చినందుకు డినో సర్, అమర్ కౌశిక్ సర్ కు ధన్యవాదాలు. దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ సర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మారు, నన్ను సవాలు చేశారు, సినిమాలోని సారాన్ని నాకు చూపించారు. మీ విశ్వాసం, మార్గదర్శకత ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్ సర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ సర్.. మీతో కలిసి పనిచేయడం ఎంతో సహజంగా, సులభంగా అనిపించింది. ఈ సినిమాలో మీతో ఉండటం ఒక అద్భుతమైన అనుభవం. మా క్రూ గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఉదయాన్నే వచ్చి, రాత్రివేళల వరకు కష్టపడ్డ వారు, పర్వతాలపై సామాగ్రి మోసిన వారు, వాతావరణ మార్పులతో పోరాడిన వారు, గాయాలను ప్యాచ్ చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే షూటింగ్ స‌జావుగా సాగింది. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఆ కష్టాలన్నీ ఫలించినట్టు అనిపించింది.

ఈ ఫోటోలు షూటింగ్ సమయంలో నా జీవితంలోని చిన్న చిన్న క్షణాలను చూపిస్తాయి. కొన్ని రోజులు మేకప్ తీసేసేంత సమయం కూడా ఉండేది కాదు. కొన్ని రోజులు రోజు ముగియకూడదనిపించేది, మరికొన్ని రోజులు డైలాగులు చెప్ప‌డానికి క‌ష్ట‌ప‌డుతుంటే ఆదిత్య సర్ పక్కనే కూర్చుని సహాయం చేసేవారు. ఇలా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు… ఇవన్నీ నాకు చాలా విలువైనవి “ అంటూ ర‌ష్మిక త‌న పోస్ట్ లో పేర్కొన్నారు. అదే విధంగా త‌న‌ను అభిమానించేవారిని ఉద్ధేశిస్తూ.. “ మీ ప్రేమ, మీ మద్దతు, మీ నమ్మకం, మీ ఎదురు చూపులు… ఇవన్నీ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైన‌ల్‌గా థామా విడుదలైంది. మీరు సినిమాను చూసి ఆనందిస్తారు. అంద‌రికీ ప్రేమతో, గర్వంతో కృతజ్ఞతలు“ అంటూ ర‌ష్మిక త‌న నోట్‌లో రాసుకొచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.