epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేల‌రాలిన ఆశ‌లు

  • ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం
  • తుఫాన్‌ ప్రభావంతో చేతికొచ్చిన పంట నీటిపాలు
  • వేల ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న వరి, పత్తి ..
  • కొనుగోలు కేంద్రాల్లో త‌డిసిమ‌ద్దైన వ‌రిధాన్యం
  • ప్రకృతి కన్నెర్రతో కన్నీరు మున్నీరవుతున్న రైతులు
  • ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వానికి వేడుకోలు
  • 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా..
  • న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ఆదుకుంటామ‌ని మంత్రి తుమ్మ‌ల భ‌రోసా
  • ఎకరాకు రూ. 10వేల చొప్పున ప‌రిహారం అందిస్తామని ప్ర‌క‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం అయింది. చేతికొచ్చిన పంట తుఫాన్ వల్ల నేల రాలింది. తుఫాన్‌ వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వస్తున్నాయి. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం, దగ్గరపోయడం రైతులకు స‌వాల్‌గా మారింది. మోంథా తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్, మెద‌క్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లోని రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వానలకు ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది. వేల ఎక‌రాల్లో వరి, పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట నీట మునగడం, క‌ళ్ల‌ముందే ధాన్యం నీటిపాల‌వ‌డంతో అన్న‌దాత‌లు గుండెలు బాదుకుంటున్నారు. ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు.

నేలకొరిగిన పంట చేన్లు

తుఫాన్‌ ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా వరి పంట కోత సమయంలో నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కోయడానికి తడిగా ఉండటంతో మిషన్లతో కోయడానికి వీలు కావడంలేదు. చైన్‌ మిషన్ల ద్వారా రైతులు వరికోతలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కోపించిన పచ్చి ధాన్యాన్ని ఆరబెట్టడంలో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ధాన్యం పచ్చిగా ఉండడంతో మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరకక సాగు ఇబ్బంది అయింద‌ని.. ఇప్పుడేమో చేతికి వచ్చిన పంట అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర జేయబట్టే అని కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆదుకుంటాం : తుమ్మ‌ల‌

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10వేల చొప్పున అందిస్తామన్నారు. 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశు సంపద, ఇల్లు నష్టపోయినా ఆదుకుంటామని చెప్పారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తార‌ని, నష్టపోయిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తార‌ని తెలిపారు. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించారు. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా నిలుస్తాం. గత ఏడాది వరదల్లోనూ భారీగా నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించినా స్పందించలేదు అని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.