epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌
కామారెడ్డి స‌భ‌లో ఇచ్చిన హామీల అమ‌లేది..?
మ‌ద్యం టెండ‌ర్ల‌లో 25శాతం వాటా ఇస్తామ‌ని మాట‌త‌ప్పింది
కేటాయింపు చేసేలా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి
లేదంటే మ‌ద్యం టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటాం
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ గౌడ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీల‌ను తుంగ‌లొ తొక్కేస్తోంద‌ని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి న‌ల‌మాస శ్రీకాంత్ గౌడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమ‌లు చేయ‌కుండా దాట‌వేత విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌న్నారు. బీసీలకు42% రిజర్వేషన్లు క‌ల్పిస్తామ‌ని బిల్లు చేసి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. రిజర్వేషన్స్ మా పరిధిలో లేవ‌ని న్యాయ స్థానాల పరిధిలో, కేంద్రం పరిధిలో ఉన్నాయ‌ని చెబుతూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీ మేర‌కు మ‌ద్యం టెండ‌ర్ల‌లో 25% వాటా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ హామీపై క‌నీసం ఊసే ఎత్త‌కుండా మ‌ద్యం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింద‌ని అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ గౌడ్‌ల‌ను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌డం లేదు

గీత కార్మికులు ప్రమాదవ‌శాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఎక్క‌డా ఇవ్వ‌డం లేద‌ని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన కార్మికుల్లో ఎంత‌మందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో ద‌మ్ముంటే ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించాల‌ని అన్నారు. ఊరురా, ప్రతి గ్రామ పంచాయితీ కి 5 ఎకరాల స్థలం గీత కార్మికుల‌కు కేటాయించి ఈత, తాటి వనాలను పెడతామ‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు కావొస్తున్న హామీపై దృష్టి పెట్టడం లేద‌న్నారు. గౌడ్‌ల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌న్నింటిని రేవంత్ రెడ్డి స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, లేని ప‌క్షంలో త‌ప్ప‌కుండా త‌గు స‌మ‌యంలో బుద్ధి చెబుతారని స్ప‌ష్టం చేశారు. మద్యం టెండర్ల గౌడ సామాజిక వ‌ర్గానికి 25శాతం వాటాను వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని, లేని పక్షంలో టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటామ‌ని అన్నారు.

యూరియా కోసం రైతుల అరిగోస‌..!

కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తే… కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతన్న అరిగోస పడుతున్నార‌ని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని రేవంత్ రెడ్డి స‌ర్కారు ఆగం చేసింద‌న్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయంపై, సాగు, ఎరువుల అవ‌స‌రాల‌పై ప్ర‌ణాళిక లేని వైఖ‌రితో ఉండ‌టంతో ఈ రోజు అన్న‌దాత‌లు రోడ్డెక్కాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గుడెద్దు వైఖ‌రిని నిర‌సిస్తూ త్వ‌ర‌లోనే రైతుల‌తో క‌లిసి పోరాటానికి సిద్ధ‌మ‌వుతామ‌ని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.