epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంస్క‌ర‌ణ‌ల‌తో కొత్త స‌మ‌స్య‌లు

  • కేంద్రానికి వచ్చే మూడేళ్లు కీలకం
  • బీజేపీ శ్రేణుల‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
  • హాజ‌రైన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి శాఖ అనేక కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకువస్తోందని.. వీటితో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. స‌మ‌స్య‌ల‌ను సమర్థవంతంగా ఎదుర్కొవాలని సూచించారు. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీలు కే.లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కోర్టుల్లో వాద‌న‌లే కీల‌కం..

అర్జున్ రామ్ మేఘవాల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పాలసీలకు అనుగుణంగా కోర్టుల్లో మనం వాదిస్తామనేది చాలా కీలకమని తెలిపారు. రానున్న మూడేళ్లు మోదీ ప్రభుత్వానికి చాలా కీలకమని ఉద్ఘాటించారు. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలని కిష‌న్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కాలంచెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు: ఎంపీ లక్ష్మణ్

కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్చిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ విజనరీ లీడర్ కాబట్టి వేగంగా స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. జీఎస్టీ తగ్గింపుతో మోదీ దీపావళి వెలుగులను పేదల ఇళ్లల్లో నిప్పుతున్నారని వివరించారు. అగ్రదేశాలు అడ్డగోలు టారిఫ్‌లతో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఫైర్ అయ్యారు. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. భారతదేశ ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుందని వెల్లడించారు. దీని ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని… ఇతరులకు ఉపాధి కలుగుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.