epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సౌదీలో ` క‌ఫాలా` వ్య‌వ‌స్థ ర‌ద్దు.. వ‌ల‌స కార్మికుల‌కు బిగ్ రిలీఫ్‌!

కాకతీయ, నేషనల్ డెస్క్: పొట్ట చేత‌ప‌ట్టుకుని గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లే.. వేలాది కార్మికుల‌కు.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు.. అతి పెద్ద సాం త్వన చేకూరింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ల్ఫ్ దేశాల‌కు ఉత్సాహంగా వెళ్లిన వారే కానీ, అంతే ఉత్సాహంగా తిరిగి త‌మ త‌మ దేశాల‌కు చేరుకున్న వారు లేరు. దీనికి కార‌ణం.. అక్క‌డ తాము ప‌నిచేస్తున్న ప్రాంతాల్లో ఎదురై న అనేక ఇబ్బందులే. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. తాము ప‌నిచేస్తున్న సంస్థ‌లు లేదా ఇళ్ల‌లోని య‌జ‌మా నులు పెట్టే న‌ర‌క‌మే!. ఈ క్ర‌మంలో ఇటీవ‌లకాలంలో అనేక మంది త‌మ‌ను తిరిగి స్వ‌దేశానికి తీసుకురా వాల‌ని.. తాము ఇక్క‌డ‌(సౌదీ) బాధ‌లు భ‌రించ‌లేక పోతున్నామ‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను వేడుకుంటున్న వీడియోలు వెలుగుచూశాయి.

మ‌రి ఎన్నో ఆశ‌ల‌తో ప‌ది రూపాయ‌లు అధికంగా ఆర్జించుకోవ‌చ్చ‌న్న భావ‌న‌తో సౌదీకి వెళ్లిన వారు ఇన్ని క‌ష్టాలు ప‌డ‌డం ఏంటి? ఇంత‌గా క‌న్నీరు కార్చ‌డం ఏంటి? అంటే.. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌ఫాలా వ్య‌వ‌స్థ‌. అంటే ఒక‌ర‌కంగా.. ఇది నియంతృత్వ వ్య‌వ‌స్థ‌. భార‌త్ స‌హా ఆసియా దేశాల నుంచి అనేక మంది కార్మికులు.. మ‌హిళ‌లు పొట్ట చేత ప‌ట్టుకుని సౌదీలోని అర‌బ్ దేశాల‌కు వెళ్తుంటారు. కానీ, అక్క‌డ‌కు వెళ్ల‌డం వ‌ర‌కే వారికి స్వేచ్ఛ ఉంటుంది. అక్క‌డ ల్యాండ్ అయిన త‌ర్వాత‌.. స‌ర్వ‌స్వం.. య‌జ‌మాని చెప్పుచేతల్లోనే ఉండాలి. వారు కూర్చోమంటే కూర్చోవాలి.. నిల‌బ‌డ‌మంటే నిల‌బ‌డాలి.

పెడితేనే ముద్ద‌.. పోస్తేనే నీరు!

అన్న‌ట్టుగా సౌదీలో కార్మికుల క‌ష్టాలు ఉంటున్నాయి. పోనీ.. తిరిగి సొంత ప్రాంతానికి వ‌చ్చేయాల‌న్నా.. స్వేచ్ఛ ఉండ‌దు. అదే.. క‌ఫాలా వ్య‌వ‌స్థ తెచ్చిన ప్ర‌ధాన క‌ష్టం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఇత‌ర దేశాల నుంచి ప‌ని కోసం వెళ్లిన వారిని య‌జ‌మానులు బానిస‌లుగా చూసినా భ‌రించ‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. స‌మ‌యానికి నిద్ర కూడా పోనివ్వ‌కుండా వేధించిన య‌జ‌మానులు కూడా ఉన్నారు. జీతం స‌రిగా ఇవ్వ‌రు, అన్నం పెట్ట‌రు.. దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. యజమాని దగ్గరే పాస్‌పోర్టు ఉంటుంది. ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్లాలి. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్నా, మృతిచెందినా, యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు. ఇన్నింటికీ మూలం క‌ఫాలా వ్య‌వ‌స్థ‌.

క‌ఫాలా.. అనేది భాగ‌స్వామ్య ప‌దానికి అర‌బిక్ రూపం. అంటే..

నేను నీకు ప‌నిచ్చాను. నువ్వు నేను చెప్పిన‌ట్టే వినాలి“ అనే భావ‌న‌. ఇది 1950లో వ‌చ్చిన విధానం. అప్ప‌ట్లో కార్మికుల‌ను పెంచుకునేందుకు తీసుకువ‌చ్చిన ఈ వ్య‌వ‌స్థ రాను రాను నియంతృత్వంగా మారింది. ఫ‌లితంగా కార్మికులు నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. ఒక్క భార‌తే కాదు.. నేపాల్, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌.. ఇలా అనేక దేశాల నుంచి పొట్ట చేత‌ప‌ట్టుకుని సౌదీకి వెళ్లిన వారి స‌మ‌స్య‌లు చెప్ప‌న‌ల‌వి కానివి. అనేక మంది ప్రాణాలు కూడా అక్క‌డే వ‌దిలేశారు.

ఎట్ట‌కేల‌కు మోక్షం…

ఈ ప‌రిణామాల‌ను, య‌జ‌మానుల తీరునునిశితంగా గ‌మ‌నించిన సౌదీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల స‌ర్వే చేయిం చింది. అనేక కేసులు పెరిగిపోతుండ‌డం కూడా దీనికి కార‌ణం. ముఖ్యంగా భార‌త్ వంటి మిత్ర దేశాల నుంచి కూడా ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో అన్నీ ఆలోచించి 1950ల నాటి ఈ క‌ఫాల వ్య‌వ‌స్థ‌ను సౌదీ ర‌ద్దు చేసింది. అయితే.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి గ‌ల్ఫ్ దేశాలు మాత్రం ఈవిష‌యంలో ఇంకా నాన్చుడు ధోర‌ణిలో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.