epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క‌విత కొత్త పార్టీ !

క‌విత కొత్త పార్టీ !

జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు

సమయం, సందర్భం, అవసరం మేర‌కు నిర్ణ‌యం

ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన

క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

25 నుంచి జ‌నంబాట‌కు శ్రీకారం

33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమం

యాదిగిరిగుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి కవిత మ‌రోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి “జనంబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన క‌విత‌.. ప్ర‌జ‌లు కోరుకుంటే త‌ప్ప‌కుండా కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటుచేస్తాన‌ని అన్నారు.

25 నుంచి జ‌నంబాట‌

ఈనెల 25 నుంచి తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనంబాట కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాలని మొన్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని, ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నాన‌ని చెప్పారు.
19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. తాము ఒక ఎన్జీవోగా ఏర్పాటైనప్పటికీ… ప్రతి నిత్యం ప్రజల కోసమే మాట్లాడమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడమని, ఇక్కడి ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన చేశామని తెలిపారు. ఈరోజు కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌గా ఉన్నప్పటికీ… రాజకీయాలు మాట్లాడుతామని, ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.

సమయం, సందర్భం బ‌ట్టి..

అయితే పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించారు. తమిళనాడు, ఏపీ, కేరళలో పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ప్రస్తావించారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదని… దానికి సమయం, సందర్భం, ప్రజలకు అవసరం ఉండాలని అన్నారు. పార్టీ అనే దానితో ప్రజలకు మేలు జరగాలని తెలిపారు. ప్రజల కోసమే తన పర్యటన అని చెప్పారు. జాగృతి జనం బాట 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కవిత తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి… అక్కడి మేధావులను, విద్యావంతులను, విద్యార్థులను, రైతులను, మహిళలను కలిసి… అక్కడి సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు.

కొత్త పార్టీ దిశగా అడుగులు !

గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలు కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జాగృతి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ… పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించ‌డం చ‌ర్చ‌నీయమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.