epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూబ్లీఫైట్ !

  • ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విస్తృత ప్రచారం
  • పాదయాత్రలతో ఓటర్ల దగ్గరకు నేతలు
  • రామచంద్రరావు నేతృత్వంలో మాస్ క్యాంపెయిన్
  • కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజ‌య్ హాజ‌రు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు
  • నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి హామీలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో మంగళవారం నియోజకవర్గంలో ‘మాస్ కాంపెయిన్’ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ బోరబండ డివిజన్ రాజ్ నగర్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింద‌ని నేత‌లు మండిపడ్డారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అవకాశం కల్పించారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్ జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరించారు. ఆరు గ్యారంటీలు సహా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.

ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుపై మండిపాటు

అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌తో ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో కలిసిపోతూ హైదరాబాద్ అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఎదురయ్యే సమస్య లను వివరించారు. రౌడీషీటర్లను ప్రోత్సహిస్తూ, కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు ఈ రెండు పార్టీలు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల పోటీలో లేకుండానే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పెత్తనం అంతా ఎంఐఎం చేస్తుందని ఆరోపించారు.

బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి

నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. గుండాయిజం, కబ్జాలు, రౌడీషీటర్ల నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారంతో జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్డు, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం.. అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు వివరించారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు ఆరా తీస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నేతలు ప్రచారం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.