epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వేధింపుల ఎక్సైజ్‌ సీఐపై చ‌ర్య‌లేవీ?

వేధింపుల ఎక్సైజ్‌ సీఐపై చ‌ర్య‌లేవీ?
విచార‌ణ పేరుతో వేచి చూసేలా..ఆచితూచి వ్య‌వ‌హారం
అర్థం కాని ఉన్న‌తాధికారుల వైఖ‌రి
ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టేలా చేస్తున్న కొంత‌మంది అధికారులు?!

 

బాధితురాలు.. ఎక్సైజ్ శాఖ‌ కానిస్టేబుల్ అఖిల‌

కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కె. అఖిలను, అదే స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జయశ్రీ వ్యక్తిగతంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వచ్చిన విష‌యం తెలిసిందే. వేధింపులు తట్టుకోలేక అఖిల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అఖిల కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత, అఖిల కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర సహోద్యోగులు కొత్తగూడెం ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సీఐ జయశ్రీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితురాలికి అండగా నిలబడి, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా అబ్కారీ అధికారిని కోరిన విష‌యం విదిత‌మే.

గతంలోనూ ఆరోపణలు…!

గతంలో కూడా ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సీఐ జయశ్రీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. సిబ్బంది చేసిన ఫిర్యాదుల మేరకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ విషయంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. విచారణ నిమిత్తం సీఐ జయశ్రీని ఖమ్మంలోని డిప్యూటీ కమిషనర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే విచార‌ణ పేరుతో సాగ‌దీత కొన‌సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు సొంత డిపార్ట్‌మెంట్ నుంచి వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మనార్హం.

అస‌లేం జ‌రుగుతోంది..?!

సంఘటనపై విచార‌ణ‌కు ఆదేశించి మూడు రోజులు గ‌డిచినా అధికారుల నుంచి ఎలాంటి యాక్ష‌న్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మహిళా కానిస్టేబుల్‌కు న్యాయం చేసేందుకు ఉన్న‌తాధికారులు సిద్ధంగాలేరా ..? అన్న ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. నిత్యం తోటి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ శాఖలో పనిచేస్తున్న కింది సాయి సిబ్బందిపై మండిపడటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటార‌నే ఆరోప‌ణ‌లు జయశ్రీ పై ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయినా అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు.ఇప్పుడు ఓ మ‌హిళా కానిస్టేబుల్ మాన‌సిక వేద‌న‌కు గురై.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డే వ‌ర‌కు వెళ్ల‌డం గ‌మనార్హం. ఇంత జ‌రిగినా ఉన్న‌తాధికారుల వైఖ‌రి నాన్చివేత ధోర‌ణిలోనే ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండ‌గా సీఐ వేధింపులకు గురి చేశారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మహిళా కానిస్టేబుల్ పక్షాన దళిత సంఘాలు ఒకవైపు.. అసత్య ప్రచారాలతో గిరిజన బిడ్డ అయిన సీఐపై కావాలనే కక్షగట్టి యూనియన్లో కొందరు పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న చ‌ర్చ జ‌రుగుతోంది. సీఐ పక్షాన కొందరు గిరిజన నేతలు ఆ శాఖ ఉన్నతాధికారులకు పరస్పరంగా ఫిర్యాదు చేయడంతో చర్యలు గైకొనడం వెనుక కొంత జాప్యం జరుగుతోంద‌న్న అభిప్రాయం అధికారుల నుంచి తెలుస్తోంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.