epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!
ఫరీదాబాద్ మాడ్యూల్ వెనుక మాస్టర్‌మైండ్ ఇమామ్ ఇర్ఫాన్‌ గుర్తింపు
జమ్మూకశ్మీర్‌ షోపియాన్‌ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌కు నేతృత్వం
మసీదు నుంచి మత మౌలికవాదం

కాక‌తీయ‌, జాతీయం : ఫరీదాబాద్‌లో ఇటీవల భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ఈ ఆపరేషన్‌లో బయటపడిన ఉగ్రవాద కుట్రలు భద్రతా వ్యవస్థలను కుదిపేశాయి. ముఖ్యంగా వైద్యులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని తేలడంతో అందరూ ఆశ్చర్యానికి గుర‌య్యారు. సాధారణంగా సేవాస్పూర్తితో ఉండాల్సిన వైద్యులు, ఉగ్రవాద మార్గం వైపు ఎందుకు మళ్లారు? అనే ప్రశ్న దేశమంతా చర్చకు దారితీస్తోంది.

అయితే తాజాగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు అయింది. ఈ ఉగ్ర మాడ్యూల్ వెనుక ఉన్న మాస్ట‌ర్‌మైండ్‌ను అధికారులు గుర్తించారు. అత‌ని పేరు ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌. జమ్మూకశ్మీర్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడి పాత్ర, సంబంధాలు, ప్రణాళికలు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇర్ఫాన్‌ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతానికి చెందినవాడు. గతంలో శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్‌ సిబ్బందిగా పనిచేశాడు. అదే సమయంలో విద్యార్థులతో సంబంధాలు పెంచుకుని, వారిని మత మౌలికవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు.

నౌగామ్‌లోని ఒక మసీదులో కలిసిన విద్యార్థులతో ఇర్ఫాన్‌ నిరంతరం సంబంధాలు కొనసాగించాడు. వారికి జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ, ఆ భావజాలాన్ని వారిలో నాటాడు. అఫ్గానిస్థాన్‌లోని కొంతమంది వ్యక్తులతో కూడా ఇంటర్నెట్‌ కాల్స్‌ ద్వారా కాంటాక్టులు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్‌లోని వైద్య కళాశాలలో ఇర్ఫాన్‌ చాతుర్యంగా పనిచేశాడు. విద్యార్థుల్లో మత మౌలికతను నాటుతూ, వారిని టెర్రర్ మార్గంలోకి తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈ మాడ్యూల్‌లో డాక్టర్‌ ముజమ్మిల్‌ మరియు ఉమర్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.

నిఘా వర్గాల ప్రకారం, మొత్తం ఉగ్ర మాడ్యూల్‌ను ఇర్ఫాన్‌నే రూపకల్పన చేశాడు. ఈ నెట్‌వర్క్‌ బయటపడిన తర్వాత భయంతో ఉన్న ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్లు సమాచారం. ఉమర్‌కి ఇర్ఫాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు కూడా అధికారులు వెల్ల‌డించారు. తాజాగా అరెస్టయిన డాక్టర్‌ షాహిన్‌, ఈ మాడ్యూల్‌కు ఆర్థిక మద్దతుదారుడిగా వ్యవహరించినట్లు సమాచారం. అతడే విదేశాల నుంచి వచ్చిన డబ్బును ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాలకు వినియోగించినట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి. కాగా, ఇమామ్‌ ఇర్ఫాన్‌ అరెస్టుతో భద్రతా సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. అతడి నెట్‌వర్క్‌, సంబంధాలు, ఫండింగ్‌ మార్గాలు.. అన్నీ ఇప్పుడు విచారణలో భాగమవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.