epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..
హీటెక్కిన బీహార్ పాలిటిక్స్!
బీహార్ ఎన్డీయేలో అంతర్గత యుద్ధం
స్పీకర్ పీఠంపై ఏర్పడిన క్లిష్ట పరిస్థితి
ఢిల్లీ వేదిక‌గా కీల‌క స‌మావేశాలు

కాక‌తీయ‌, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అఖండ మెజారిటీతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూటమి వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఘనంగా కనిపించినా, ప్రభుత్వ నిర్మాణం నేపథ్యంలో కూటమిలో రాజకీయ లెక్కలు, శక్తి ప్రదర్శనలు మొదలయ్యాయి. నితీశ్ కుమార్‌ నాయకత్వాన్ని బీజేపీ అంగీకరించినా… కీలక పదవులు, మంత్రిత్వ శాఖల పంపకంలో రాజకీయ ఆధిపత్య యుద్ధం స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్త మంత్రివర్గ కూర్పుపై బీజేపీ–జేడీయూ మధ్య అంతర్గత చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. ఏ పార్టీకి ఏ శాఖ ఇవ్వాలి? ఎవరు మంత్రులు కావాలి? అన్న విషయాలపై ఇప్పటికే ఫార్ములా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే త‌రుణంలో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఎన్‌డిఎలో సంఖ్యాబలం బీజేపీకే ఎక్కువ‌. కానీ సీఎం కుర్చీ జేడీయూకి వెళ్లడంతో స్పీకర్ పదవిని ఖచ్చితంగా త‌మకే బీజేపీ ప‌ట్టుప‌డుతోంద‌ట‌. గత అసెంబ్లీలో స్పీకర్‌గా బీజేపీకి చెందిన నంద కిశోర్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ పనిచేశారు. ఈసారి కూడా అదే ఫార్ములాను కొనసాగించాలనేది బీజేపీ భావిస్తోంది. అయితే ఈసారి స్పీకర్ పదవి తమకే రావాలి అని పట్టుబడుతోంది జేడీయూ. దీంతో స్పీక‌ర్ సీటు కోసం ఇరు పార్టీల మ‌ధ్య భారీ ఫైట్ నెల‌కొంది.

ఈ వివాదం పరిష్కారం కోసం జేడీయూ నేత నితీశ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ టాప్ లీడర్లతో కీలక చర్చలు జరపనున్నారు. మంత్రివర్గంలో ఏ శాఖ ఎవరికన్న దానికంటే.. ఈ సమావేశంలో స్పీకర్ పోస్టే ప్రధాన చర్చ అంశం కానున్నట్లు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. జేడీయూ సీనియర్ నాయకులు సంజయ్ కుమార్ ఝా, లాలన్ సింగ్ సహా పలువురు ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణం అయ్యారు. స్పీకర్ సీటు కోసం బీజేపీపై ఒత్తిడి చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

బీహార్ శాసనసభలో కీలక పదవి కావడంతో బీజేపీ కూడా గ‌ట్టి ప‌ట్టు మీద ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ నేతలు పాట్నాలో అర్థరాత్రి వరకు వ్యూహాత్మక చర్చలు జరిపార‌ట‌. స్పీకర్ పదవితో పాటు ప్రముఖ శాఖలను కూడా ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కేంద్రాధికారులకు తెలియజేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్పీకర్ పదవిపై నెలకొన్న పవర్ గేమ్, లాబీయింగ్, టెన్షన్ బీహార్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. ఎలాగైనా నవంబర్ 20 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది ఎన్డీయే లక్ష్యం. అయితే స్పీకర్ పీఠంపై బీజేపీ–జేడీయూ మధ్య ఎవరి మాట నిలుస్తుందో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.