epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌?

భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌?
బీహార్‌లో ఏర్ప‌డ్డ‌ కొత్త ప్రభుత్వం
పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
కేబినెట్‌లో ముగ్గురు మహిళలకి స్థానం
క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం వరకు శ్రేయసి సింగ్ ప్రయాణం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించగా, మొత్తం 26 మంది మంత్రులు కేబినెట్‌లో చేరారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

ఈ సారి బీహార్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళలకు స్థానం లభించింది. లేషి సింగ్, రమా నిషాద్‌తో పాటు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయసి సింగ్ తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆమె రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయడంతో ఇప్పుడు ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది.

1991 ఆగస్టు 29న బీహార్‌లోని గిఢౌర్ గ్రామంలో జన్మించిన శ్రేయసి, ఎదిగింది షూటింగ్ ప్రపంచంలో. ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు అందించి దేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన షూటర్‌గా ఆమె సుపరిచితమే. 2014 లో కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ఫైనల్‌లో 92 పాయింట్లు సాధించి ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. 2017లో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషికి గాను ఆమెకు అర్జున అవార్డు లభించింది.

29 ఏళ్లకే బీజేపీలో అడుగు… తొలి ఎన్నికే సంచలన విజయం

2020లో కేవలం 29 ఏళ్ల వయసులో ఆమె బీజేపీలో చేరి రాజకీయాల పట్ల తన ఆసక్తిని ప్రదర్శించారు. అదే సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జముయ్ నుంచి పోటీ చేసి RJD అభ్యర్థి విజయ్ ప్రకాష్‌ను 41,000కుపైగా మెజారిటీతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2025లో జరిగిన ఎన్నికల్లో కూడా శ్రేయసి జముయ్ నియోజకవర్గం నుంచి 54,498 ఓట్ల భారీ తేడాతో గెలుపొంది మరొకసారి తన రాజకీయ బలాన్ని చాటారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆమె బీహార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.

అయితే శ్రేయసి రాజకీయాలకు కొత్తేమి కాదు. ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి ఎంపీగా ఉన్నారు. తండ్రి, తాత ఇద్దరూ నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI)లో కీలక పదవుల్లో పనిచేశారు. కాగా, కామన్వెల్త్‌ గేమ్స్‌ పతకాల ప్రకాశం నుంచి బీహార్ రాజకీయ జగత్తులో మంత్రిపదవి వరకు శ్రేయసి సింగ్‌ ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. క్రీడలో సంపాదించిన క్రమశిక్షణ, ధైర్యం, ఫోకస్ ఇప్పుడు రాజకీయాల్లో ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్‌కు పతకాలు తెచ్చిన ఈ షూటర్‌.. ఇప్పుడు బీహార్ అభివృద్ధి లక్ష్యానికి టార్గెట్‌ సెట్ చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.