epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బి ఆర్ ఎస్ శ్రేణుల్లో బహిర్గతమైన విభేదాలు

బి ఆర్ ఎస్ శ్రేణుల్లో బహిర్గతమైన విభేదాలు
పార్టీ క్యాడర్ లో కలవరం
రేగా వర్సెస్ మాజీ మంత్రి వనమా
పార్టీ అధిష్టానం శాసిస్తుంది నేను అమలు చేస్తున్న.. మాజీ ఎమ్మెల్యే రేగా
సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు ఎదుటే పంచాయతీ

కాకతీయ, కొత్తగూడెంరూరల్: ఇప్పుడిప్పుడే అధికార పార్టీ కాంగ్రెస్ను ఎండగడుతూ ప్రజల్లో ఒక నమ్మశక్యమైన పార్టీ బలపడుతుందని ప్రజలు ఆలోచిస్తున్న లోపే తెలంగాణ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ శ్రేణిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు వర్సెస్ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మధ్య ప్రోటోకాల్ రగడ దుమారం లేపుతుంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉండి రేగా కాంతారావు ఒంటెద్దు పోకడపోతున్నాడని, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంతో అనుభవం గల మాజీ మంత్రి వనమాకు అసలు సమాచారం ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో విభేదాలు బగ్గుమంటున్నాయి. రేగా వర్సెస్ మాజీ మంత్రి వనమా మధ్య అంతర్గత విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ విభేదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి బంగపాటు తప్పేటట్టు లేదని పలు అభిప్రాయపడుతున్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ సాధనలో చేపట్టిన ఉద్యమ చరితను ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 29న దీక్ష దివాసును జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించాలని సోమవారం కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తగూడం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చివరి నిమిషంలో హాజరు కావడం పట్ల ఆయా కార్యకర్తల్లో అయోమయంనెలకొంది. కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ వద్దిరాజు ఎదుటే వనమా వర్గీయులు ఎంపీ వద్దు రాజుకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పరచడంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా వ్యవహరించిన వనమా వెంకటేశ్వరరావును కాదని రేగా కాంతారావు ఏకపక్ష ధోరణిని నిర్వహిస్తున్నారని రేగా వ్యవహార శైలి కొత్తగూడెం నియోజకవర్గం బిఆర్ఎస్ శ్రేణుల్లో జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షత హోదాలో ఉన్న రేఖా కాంతారావు కొత్తగూడెం నియోజకవర్గం కాకుండా భద్రాద్రి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారం లో వచ్చేందుకు కార్యకర్తలను అందర్నీ కలుపుకొని పోవాలని, బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుల్ని విస్మరిస్తే భద్రాద్రి జిల్లాలో టిఆర్ఎస్కు మను కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేగా కాంతారావు ఏకపక్ష ధోరణిపై ఎంపీ వద్దిరాజుకు ఫిర్యాదు చేస్తున్నామని వనమా వర్గీయులు తేల్చి చెప్పారు.

సానుకూలంగా సర్దుబాటు చేస్తాం
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ విభేదాలను పక్కనపెట్టి అందరూ ఏకతాటిపై వచ్చి ఆ పార్టీ గెలుపుకు సర్వత్ర ప్రయత్నం చేస్తున్నానని నేతల్లో అలుముకున్న అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సర్ది చెప్పారు

పార్టీ అధిష్టానం చెప్పింది నేను చేస్తా
మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ రేగ కాంతారావు.
ఎవరు ఎన్ని వేషాలు వేసినా పార్టీకి కట్టుబడి పని చేస్తామని టిఆర్ఎస్ అధిష్టానం చెప్పిన విషయాలను తూచ తప్పకుండా పాటిస్తానని ఈ విషయంలో రాజీ పడేది లేదని మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం చెప్పిన విషయాల తోతాను వివరిస్తున్నానని ఈ విషయంలో నా వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని తెలిపారు.

*కెసిఆర్ ని తెలంగాణ ముఖ్యమంత్రిగా నిలబెట్టడమే మా ధ్యేయం. ..మాజీ మంత్రి వనమా
నలభై సంవత్సరాలు కాంగ్రెస్‌లో ఉన్నా, తెలంగాణ సాధించిన మా తెలంగాణ బాపు పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరాననిపదవులు నాకు కొత్తవి కాదనీ… నలభై ఏళ్ల రాజకీయ జీవితం లో ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కొన్నాననీ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర స్పష్టం చేశారు.ఏది ఏమైనా—నా కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తాననీ. మిగతావన్నీ దేవుడే చూసుకుంటాడనీ ఆవేదన వ్యక్తం చేశారు
ఈ నెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఐకమత్యంతో జయప్రదం చేసి తీరుతామని స్పష్టం చేశారు
ఈ సమావేశంలో అశ్వరావుపేట ఇల్లందు మాజీ ఎమ్మెల్యేలు మేచ్చా నాగేశ్వరరావు బానోతు హరిప్రియ, మాజీ మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దిండిగల రాజేందర్, నాయకులు రామకృష్ణ రావులపల్లి రాంప్రసాద్, సంకు బాపన అనుదీప్ సింధు తపస్వి మాజీ సర్పంచ్ ఆంగోత్ మోతి నాయకులు జడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.